Home Loan Statement for Income Tax 2023-24

Home Loan Statement for Income Tax 2023-24 ఆర్ధిక సంవత్సరం లో ఇన్కమ్ టాక్స్ లో చూపించుటకు, తాను ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న Home Loan Statement, బ్యాంకు నుండి తీసుకొని రావాలి.

ప్రతి ఉద్యోగి ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇన్కమ్ టాక్స్ లో రాయితీ పొందుటకు,తాను ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న హోమ్ లోన్ స్టేట్మెంట్, బ్యాంకు నుండి తీసుకొని రావాలి. ఈ మధ్య బ్యాంకు వాళ్ళు చాలా మందికి ఈ హోమ్ లోన్ స్టేట్మెంట్, బ్యాంకు కు సంబందించిన యాప్ లో నుంచి నేరుగా తీసుకోమని సలహా ఇస్తున్నారు.

SBI ద్వారా లోన్ తీసుకొని ఉంటే SBI YONO యాప్ ద్వారా లోన్ స్టేట్మెంట్ తీసుకోమని, బ్యాంకు అధికారులు చెబుతున్నారు.SBI ద్వారా హోమ్ లోన్ తీసుకున్న వారు ఏలా బ్యాంకు కు వెళ్ళకుండా హోమ్ లోన్ స్టేట్మెంట్ తీసుకోవాలో చూద్దాం. ఈ హోమ్ లోన్ స్టేట్మెంట్ ను SBI NET BANKING ద్వారా సులువుగా తీసుకోవచ్చు. దీనికోసం SBI NET BANKING , USER ID మరియు PASSWORD ఉండాలి.

మీకు SBI YONO యాప్ ఉంటే SBI NET BANKING ,USER ID మరియు PASSWORD ఉన్నట్టే. SBI YONO యాప్ లో లాగిన్ అవ్వడానికి ఏదైతే USER ID మరియు PASSWORD వాడతారో అదే SBI NET BANKING లో లాగిన్ అవ్వడానికి వాడాలి.ఈ మధ్య బ్యాంకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి SBI YONO యాప్ ఇంస్టాల్ చేసి USER ID మరియు PASSWORD క్రియేట్ చేసి ఇస్తున్నారు.

మీకు ఇంకా SBI NET BANKING లేకపోతే ,బ్యాంకు కు వెళ్ళకుండా ఏలా ఓపెన్ చేయాలో తెలుసుకోవడానికి ఈ లింక్ ను క్లిక్ చేయండి. https://mywebread.com/how-to-open-sbi-net-banking/

Home Loan Statement for Income Tax 2023-24 తీసుకునే విధానం.

Step:- 1 ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి USER ID మరియు PASSWORD మరియు Image captcha ఎంటర్ చేయండి. https://retail.onlinesbi.sbi/retail/login.htm

Step:-2 మీ Net Banking page లో లాగిన్ అవుతారు తరువాత పైన కనిపించే బార్ లో e-Services ను క్లిక్ చేయండి

Home Loan Statement for Income Tax, 2022-23

Step:-3 తరువాత My Certificates ను క్లిక్ చేయండి.

Home Loan Statement for Income Tax, 2022-23

Step:-4 తరువాత Home Loan Int. Cert. (Prov) ను క్లిక్ చేయాలి.

Step:-5 మీ లోన్ ఎకౌంటు ను సెలెక్ట్ చేసి, సబ్మిట్ చేయండి. Home Loan Certificate display అవుతుంది.

Step:-6 Download in PDF పై క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది, ప్రింట్ తీసుకోవచ్చు.

Leave a Comment