My Activity History

మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే మీరు ఏ సమయంలో ఏమి చేస్తున్నారో,చాలా ఈజీ గా చెప్పవచ్చు. నేడు స్మార్ట్ ఫోన్ వాడడం సర్వసాధారణ అయింది. వయస్సు తో సంబంధం లేకుండా నిత్యం మొబైలు ఫోన్ లో google లేదా YouTube చూస్తుంటారు.

మీకు తెలియకుండానే,మీ ఇష్టాలు,అభిరుచులు,మీ ఆలోచనలు, మీ మనసత్వం,ఇలా అన్ని వేరే వారికి చేరిపోతున్నాయి.మీరు చూసే అంశాలను బట్టి మీ అభిరుచిని పసిగట్టి google లేదా YouTube,మీకు అటువంటి విషయాలే చూపిస్తుంది. ఉదాహరణకు మీరు విద్య సంబంధమైన విడియో ఎక్కువగా చూస్తే YouTube పదే,పదే విద్య  సంబంధమైన విడియో లను చూపిస్తుంది. అదే సందర్భంలో  YouTube విద్య కు అనుబంధమైన ప్రకటలను చూపిస్తుంది. మీరు పాటల ప్రియులు అయితే ఒకటి,రెండు సార్లు పాటలను సెర్చ్ చేస్తే,తిరిగి YouTube పాటల వీడియోస్ చూపిస్తుంది.

మీరు ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేక లేదా అనుకూల వీడియోలు చూస్తే ,మీరు ఈ సారి YouTube అటువంటి వీడియోస్ లను చూపిస్తుంది. అంటే Google News లేదా YouTube మీ అభిరుచిని ఇట్టే పసిగడుతుంది.వాటి అల్గారిధమ్ అలా తయారు చేయబడి ఉంటుంది.మీరు అశ్లీల చిత్రాలు ఎక్కువగా చూస్తే,మళ్ళీ అవే Google News లేదా YouTube చూపిస్తుంది. మీ పిల్లలు మీ ఫోన్ లో YouTube ఓపెన్ చేస్తే,ఆలోచించండి ఏమి అవుతుంది.

Google లేదా YouTube కి ఏమి లాభం?

google లేదా YouTube వాటి అల్గారిధమ్ ద్వారా ట్రాక్ చేసి ఆ అంశాలకు సంబంధించిన వ్యాపార ప్రకటనలను చూపిస్తుంది.తద్వారా డబ్బు సంపాదిస్తుంది. అయితే google లేదా YouTube మీ డేటా ను భద్రంగా ఉంచుతుంది. google వల్ల మీకు ఏటువంటి ప్రమాదం లేదు. YouTube కూడా google ప్రొడక్ట్ కాబట్టి ఏటువంటి భయం లేదు.

మీ Activity ని  ట్రక్ చేసి చూడవచ్చా?

వంద శాతం మీరు google లేదా YouTube ఏమి చూశారో ఇట్టే చూడవచ్చు. మీ మెయిల్ ID ఉంటే చాలు మీ Activity ని చూడవచ్చు.స్మార్ట్ ఫోన్, మెయిల్ ID ఉంటేనే పనిచేస్తుంది. మీ ఫోన్ లో గూగుల్ ఓపెన్ చేసి My Activity History అని టైపు చేసి సెర్చ్ చేస్తే, మీరు చూసిన అన్ని అంశాలు కనిపిస్తాయి. లేదా ఈ క్రింది లింకు ను క్లిక్ చేయండి.

ఈ లింకు ను క్లిక్ చేయండి. CLICK HERE

ఏలా మిస్ యూజ్ అవుతుంది.

మీ మెయిల్ ID మరియు పాస్ వర్డ్ తెలిస్తే,చాలా ఈజి గా,మీ Activity History చూడవచ్చు. కొన్ని సైటుల OTP లు మెయిల్ ID కు వస్తుంటాయి.సైబర్ నేరాలు జరగవచ్చు, మీ  Activity History చూసి,దానికి సంబంధించిన వ్యాపార ప్రకటనలను మీ మెయిల్ తరచూ పంపవచ్చు.

వేరే వారు చూడకుండా ఏమి చేయాలి?

మీ మెయిల్ ID మరియు పాస్ వర్డ్ ను గోప్యంగా ఉంచండి.మీ ఇంట్లో కంప్యూటరు లో కాకుండా,ఇతర కంప్యూటరు లలో మీ మెయిల్ ID తో లాగిన్ అవ్వవద్దు, ఒకవేళ అత్యవసరంగా లాగిన్ అయితే లాగ్ అవుట్ అవ్వడం మరచిపోకండి.

My Activity History ని డిలీట్ చేయడం ఏలా?

google లో My Activity History అని టైపు చేసి సెర్చ్ చేస్తే,మీ Activity History చూపిస్తుంది. computer లేదా  Laptop లో ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్ Delete activity by దాని పై క్లిక్ చేసి సూచనలు ఫాలో అయి Delete చేయవచ్చు. మొబైలు లో అయితే పైలా సర్చ్ చేసి లెఫ్ట్ సైడ్ ఉండే మూడు లైన్స్ ను క్లిక్ చేస్తే Delete activity by  కనబడుతుంది. పైలా చెసి Delete చేయవచ్చు. కానీ మళ్ళీ ట్రాక్ చేయడం ప్రారంభిస్తుంది. అసలు google మీ Activity ని ట్రాక్ చేయకుండా ఉండాలంటే Activity History ని సెర్చ్ చేసి ఈ క్రింద చూపిన మూడింటిని ఆఫ్ చేయండి.