CALL FORWARDING అంటే ఏమిటి?
CALL FORWARDING SCAM| ప్రస్తుతం సోషల్ మీడియాలో తరుచూ వినిపిస్తున్న మాట. ఈ రోజుల్లో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి.సైబర్ నేరగాళ్లు మన బ్యాంక్ అకౌంటు లో డబ్బులు అక్రమంగా కొట్టేస్తున్నారు.ఇలా చేయడానికి సైబర్ నేరగాళ్లు కొత్త మార్గం ఎన్నుకున్నారు అదే కాల్ ఫార్వాడింగ్ (CALL FORWARDING).
CALL FORWARDING ఎలా జరుగుతుంది?
మీరు బసుల్లో, ట్రైన్స్ లో లేదా మరియేదైనా పబ్లిక్ రవాణా లో ప్రయాణించే తప్పుడు,లేదా పబ్లిక్ ప్లేస్ లో ఉన్నపుడు, బాగా అర్జంట్ ఉన్నట్టు మీ దగ్గరకు వచ్చి ఫోన్ ఇవ్వండి,ఇంటికి ఒక కాల్ చేయాలి,అని ఫోన్ సైబర్ నేరగాళ్లు అడుగుతారు.ఫోన్ చేస్తునట్టు నటిస్తూ *401#అతని ఫోన్ నెంబర్ డైల్ చేస్తాడు. ఉదాహణకు అతని ఫోన్ నెంబర్ 1234567890 అయితే *401#1234567890 డైల్ చేస్తాడు. తరువాత మీకు వచ్చే కాల్స్ లేదా OTP లు అన్ని అతని నెంబర్ కు FORWARD అవుతాయి.OTP ద్వారా మీ అకౌంటు లో డబ్బులు డ్రా చేసుకోవచ్చు.
మీ ఫోన్ లో CALL FORWARDING జరిగిందా లేదా అని తెలుసుకోవడం ఏలా?
మీ ఫోన్ నుంచి *#21# డైల్ చేయండి,call forwarding అయితే చూపిస్తుంది.
CALL FORWARDING డెలిట్ చేయడం ఏలా?
పై విధంగా చేస్తే call forwarding అయినట్టు చూపిస్తే,మీ ఫోన్ నుంచి ##002# డైల్ చేయండి,call forwarding డెలిట్ అవుతుంది.
CALL FORWARDING జరగకుండా తీసుకునే ముందు జాగ్రత్తలు.
- అపరిచిత వ్యక్తులకు ఫోన్ ఇవ్వకూడదు.
- మొబైలు ఫోన్ ని తరుచుగా చెక్ చేయాలి.
- తరుచుగా ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి సెక్యూరిటీ స్కాన్ చేయాలి.