House Tax (ఇంటి పన్ను)
సాధారణంగా ఇంటి పన్నును property Tax అంటారు. ఈ టాక్స్ ను ప్రతి సంవత్సరం కడుతూ ఉంటాము. మీ ఇంటి ఏరియాను లెక్కించి మున్సిపల్ సిబ్బంది టాక్స్ ను నిర్ణయిస్తారు. ఈ నిర్ణయించిన టాక్స్ కు సంబంధించిన నోటీసును మీకు క్రమం తప్పకుండా అందిస్తారు.ఆ నోటిసులో ఉన్న టాక్స్ ను మనం చెల్లిస్తాము.
Tax Notice(టాక్స్ నోటిసు) ను ఆన్లైన్ లో చూచుకోవచ్చా?
మీకు మున్సిపల్ సిబ్బంది జారీ చేసిన నోటీసును ,మీరు ఆన్లైన్ లో సరిచూసుకోవచ్చు మరియు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అది ఏలా చేయవచ్చో చూద్దాం. 10 అంకెల, మీ ఇంటి PTIN (Property Tax Identification Number) తెలిసి ఉండాలి. మున్సిపల్ సిబ్బంది జారీ చేసిన,మీ ఇంటి పాత నోటిసులపై ఈ నెంబర్ ఉంటుంది లేదా గతంలో మీరు చెల్లించిన పాత రసీదు పైన ఉంటుంది.
మీ ఇంటి PTIN (Property Tax Identification Number) ను ఇలా తెలుసుకోండి.
మీ ఇంటి PTIN (Property Tax Identification Number), దీనినే Assessment number కూడా అంటారు. ఈ క్రింది లింకు ను క్లిక్ చేసి మీ ఇంటి డోర్ నెంబర్ ను ఎంటర్ చేయండి PTIN కనబడుతుంది.
Page ఓపెన్ అయిన తరువాత Property Tax Payment by Door No క్లిక్ చేసి మీ జిల్లా, మున్సిపాలిటీ ,ఇంటి నెంబర్ ఎంటర్ చేస్తే PTIN కనబడుతుంది. ఆ నెంబర్ ను ఒకచోట రాయండి.
Property Details (ఇంటి వివరాలు) ఆన్లైన్ లో చూసే విధానం
క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి తరువాత జిల్లాను సెలెక్ట్ చేయండి, మీ మున్సిపాల్టి ని సెలెక్ట్ చేయండి,మీ ఇంటి PTIN (Property Tax Identification Number) , ఓనర్ పేరు, హౌస్ నెంబర్ అవసరం లేదు, సెర్చ్ పై క్లిక్ చేయండి. వివరాలు వస్తాయి. కుడివైపు కనిపించే View Details పై క్లిక్ చేయండి. ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన మీ కట్టవలసిన టాక్స్ వివరాలు కనబడతాయి. అక్కడే Payment ఆప్షన్ కూడా ఉంటుంది, టాక్స్ ఆన్లైన్లో పే చేయవచ్చు. లేదా వేరే ఆప్షన్లో పే చేయవచ్చు.
https://cdma.cgg.gov.in/cdma_arbs/CDMA_PG/PTMenu#
View Assessment Details (మీ ఇంటి టాక్స్ అంచనా వివరాలు)
క్రింద ఉన్న లింక్ క్లిక్ చేయండి తరువాత Assessment Number (PTIN) ,మొబైల్ నెంబర్ (ఏదైనా) అక్కడ ఉన్న Captcha ఎంటర్ చేయండి. search పై క్లిక్ చేయండి. మీ ఇంటి ఫోటో(House Photo), ఇంటి పూర్తీ అడ్రస్(House Address), డిమాండ్ నోటిస్ వివరాలు (Details of Demand Notice) , ప్రాపర్టీ టాక్స్ వివరాలు(Property Details) , ప్రాపర్టీ మెజర్మెంట్ డీటెయిల్స్(Property management Details) ,పేమెంట్ హిస్టరీ(Payment History) ,ప్రాపర్టీ టాక్స్ డ్యూ(Property Tax Due) మొదలైనయి ఇక్కడ కనిపిస్తాయి.
https://cdma.cgg.gov.in/CDMA_PT/ViewAssessments/CitizenAsmtSearch
Property Tax Payment (ఇంటి టాక్స్ ఆన్లైన్ లో పే చేసే విధానం)
మీ ఇంటి టాక్స్ ను ఆన్లైన్ లోనే కట్టవచ్చు .ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి. 10 అంకెల PTIN నెంబర్ ఎంటర్ చేయండి. ఇంటి టాక్స్ డ్యూ నోటీసు కనబడుతుంది. వివరాలు సరిచూసుకోండి, అన్ని సరిగా ఉన్నాయని నిద్దారణ చేసుకున్న తరువాత , క్రింది భాగంలో మొబైల్ నెంబర్,మెయిల్ ఐడి ఇవ్వండి. తరువాత Bill Desk లేదా CC Avenue సెలక్ట్ చేయండి. Proceed to Payment పై క్లిక్ చేయండి.పేమెంట్ చేయండి. payment status verify చేయండి.
https://cdma.cgg.gov.in/cdma_arbs/CDMA_PG/PTMenu#
Check Payment Status (పేమెంట్ పూర్తీ అయిందా లేదా చెక్ చేయండి)
క్రింది లింక్ ను క్లిక్ చేయండి Payment Type లో Property Tax ను సెలెక్ట్ చేయండి. PTIN నెంబర్ ఎంటర్ చేయండి. payment status కనబడుతుంది. ఇక్కడే రసీదు ప్రింట్ తీసుకోవచ్చు.
https://cdma.cgg.gov.in/CDMA_ARBS/General/CheckPaymentStatus
Print Receipts (రసీదులు ప్రింట్ తీసుకోవడం)
House Tax Payment చేసిన అన్ని రసీదులు ప్రింట్ తీసుకోవచ్చు. వివిధ అవసరాలకు ఈ రసీదులు ఉపయోగపడతాయి.ఉద్యోగులు ప్రావిడెంట్ లోన్స్ లేదా హౌస్ లోన్స్ తీసుకోవడానికి,ఇతర అవసరాల కోసం ఏప్పుడైనా ఈ వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మున్సిపల్ కమీషనర్ అప్రూవర్ చేసిన ఇంటి Digital Signature ఉన్న సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయడం.
ఈ క్రింది లింకు ను క్లిక్ చేసి PTIN నెంబర్ ఎంటర్ చేయండి.మున్సిపల్ కమీషనర్ అప్రూవర్ చేసిన ఇంటి Digital Signature ఉన్న సర్టిఫికేట్ వస్తుంది. ప్రింట్ చేసుకోవచ్చు.
https://cdma.cgg.gov.in/CDMA_ARBS/PaymentsAck/GetPTSAcertificates