తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎంసెట్ పేరు మారుస్తూ ఉత్తర్వులు
TS Common Entrance Tests -2024,తెలంగాణ 2024-25 విద్యాసంవత్సరానికి ఎంసెట్ (ఈఏపీ సెట్) సహా మరో ఆరు కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీలు ఖరారయ్యాయి. ఇక ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి గురువారం విడుదల చేసింది అయితే ఎంసెట్ పేరును ఉన్నత విద్యామండలి మార్చింది. టీఎస్ ఈఏపీసెట్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
టీఎస్ ఎంసెట్ (ఈఏపీ సెట్) TS EAPCET-2024
మే 9 నుంచి 11వ తేదీ వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహించున్నారు. మే 12, 13 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మాసీ ప్రవేశ పరీక్ష జరగనుంది. జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో టీఎస్ ఎంసెట్ నిర్వహించనున్నారు.
టీఎస్ పీఈసెట్ TS ECET-2024
Diploma Holders, B.Sc Holders ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశం కోసం జరిపే, టీఎస్ పీఈసెట్ ప్రవేశ పరీక్ష ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ ప్రవేశ పరీక్షను మే 6వ తేదీన నిర్వహించనున్నారు
టీఎస్ ఎడ్ సెట్ TS Ed.CET-2024
బీఈడీ కోర్సులో ప్రవేశం కోసం ఉద్దేశించిన టీఎస్ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష మే 23న జరగనుంది. నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహించనుంది.
టీఎస్ లా సెట్ TS LAWCET-2024
3 ఏండ్ల న్యాయవిద్య, 5 ఏండ్ల లా కోర్సులో ప్రవేశానికై నిర్వహించే టీఎస్ లా సెట్ ఎంట్రన్స్ టెస్ట్.. జూన్ 3వ తేదీన నిర్వహించనున్నారు.
అదే రోజు… ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ టెస్టును కూడా నిర్వహించనున్నారు. లాసెట్, పీజీ ఎల్‌సెట్‌లను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది
టీఎస్ ఐసెట్TS ICET-2024
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్ష.. జూన్ 4, 5వ తేదీల్లో నిర్వహించనున్నారు. కాకతీయ యూనివర్సిటీ నిర్వహణలో ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్టు జరగనుంది.
టీఎస్ పీజీఈసెట్ TS PGECET-2024
ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఉద్దేశించిన టీఎస్ పీజీఈసెట్ పరీక్ష… జూన్ 6 నుంచి 8 తేదీల మధ్యలో నిర్వహించనున్నారు. హైదరాబాద్ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్టులు జరగనున్నాయి.
టీఎస్ పీఈసెట్ TS PECET-2024
బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ పీఈసెట్ పరీక్ష జూన్ 10 నుంచి 13వ తేదీల మధ్యలో నిర్వహించనున్నారు. ఈ ఎంట్రెన్స్ టెస్టును శాతవాహన యూనివర్సిటీ నిర్వహించనుంది