TS EAMCET 2023 Special Counselling Schedule

TS EAMCET 2023 Special Counselling Schedule

 

TS EAMCET 2023 Engineering Special Counselling:ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు..

TS EAMCET | తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల రాష్ట్రంలో నాలుగు కాలేజీలు మంజూరు కాగా(1.JNTU Engineering College, Mahabubabad (JNMB), 2. JNTU Engineering College, Palair (JNPL) 3. Kommuri Pratap Reddy Institute of Management (KPRM)  4. TRR College of Technology (TRRM) ) కొత్త కోర్సులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. గురువారం నుంచి ఈ నెల 22 వరకు ఇంజినీరింగ్‌ వెబ్‌ ఆప్షన్ల అవకాశం కల్పించారు. ఈ నెల 26న ప్రత్యేక విడత ఇంజినీరింగ్‌ సీట్లను కేటాయించనున్నారు. ఈ నెల 27 నుంచి 29 వరకు విద్యార్థులు కాలేజీల్లో చేరేందుకు అవకాశం ఉండనున్నది.

స్పాట్‌ అడ్మిషన్లకు 26న మార్గదర్శకాలు విడుదలకానున్నాయి. ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా 19,049 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కంప్యూటర్‌ కోర్సులకు చెందిన సీట్లు 4వేలకుపైగానే ఖాళీగా ఉన్నాయి. సీఎస్‌సీలోనే 3వేలకుపైగా సీట్లు మిగిలిపోయాయి. సివిల్‌ ఇంజినీరింగ్‌లో 2505, ఈసీఈలో 2721, ఈఈఈలో 2630, ఐటీలో 1785, మెకానికల్‌లో 2542 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

TS EAMCET 2023  Special Counselling Schedule

Special Phase Counselling      Dates
Online Slot Booking for Certificate Verification     17-08-2023
Certificate Verifications       18-08-2023
Web Options 17-08-2023 to 22-08-2023
1st Phase Seat Allotment        26-08-2023
Payment of Tuition Fee & Self Reporting through website 26-08-2023 to 28-08-2023
 Reported to Allotted College 27-08-2023 to 29-08-2023

Leave a Comment