SBI ఖాతాదారులకు అలర్ట్‌ .. KYC అప్‌డేట్‌ చేశారా? (sbi kyc)

State bank of India KYC Update: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇటీవ‌ల కేవైసీ అప్‌డేట్ చేయ‌నందున ప‌లువురి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. అయితే ఖాతాల నిలిపివేత‌పై ప‌లువులు ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన ఎస్‌బీఐ.. బ్యాంకు సేవ‌లు నిరంత‌రాయంగా కొన‌సాగేందుకు, ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం వినియోగదారులు వారి కేవైసీని క్రమానుగతంగా అప్‌డేట్ చేయాల‌ని తెలిపింది. అంతే కాకుండా కేవైసీ అప్‌డేష‌న్‌కు సంబంధించిన స‌మాచారాన్ని బ్యాంకు ఖాతాదారులకు ఎస్ఎంఎస్ లేదా ఈ- మెయిల్ ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌జేస్తున్నామని ఎస్‌బీఐ వెల్ల‌డించింది.

SBI కేవైసీని(SBI KYC) ఎలా అప్‌డేట్ చేయాలి?

బ్యాంకు నుంచి కేవైసీ స‌మాచారం అందిన వినియోగ‌దారులు.. కేవైసీ అప్‌డేష‌న్‌కు సంబంధించి నిర్దిష్ట ఫార్మాట్‌తో కూడిన ఫారం స‌బ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు ఆన్‌లైన్‌లోనూ, బ్యాంక్ బ్రాంచి వ‌ద్ద కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఫారాన్ని పూర్తి చేసి, ఫారం కింది భాగంలో క‌స్ట‌మ‌ర్ సంత‌కం అని ఉన్న చోట సంత‌కం చేసి.. నేరుగా బ్యాంక్‌ బ్రాంచికి వెళ్లి ఇవ్వొచ్చు. లేదా వినియోగ‌దారులు బ్యాంకు వ‌ద్ద న‌మోదు చేసిన ఈ-మెయిల్ ఐడీ ద్వారా బ్యాంకు బ్రాంచి ఈ – మెయిల్ ఐడీకి మెయిల్‌ చేయొచ్చు. పోస్టల్‌ ద్వారా కూడా పంపించొచ్చు. ఇంత‌కు ముందు ఇచ్చిన కేవైసీ స‌మాచారానికి, ప్ర‌స్తుతం ఉన్న కేవైసీకి ఎలాంటి మార్పులూ లేని వారు మాత్ర‌మే ఈ- మెయిల్ ఐడీ, పోస్టల్‌ ద్వారా కేవైసీ స‌బ్మిట్ చేయ‌వ‌చ్చు.

మీ ఫోన్ కీ వచ్చే లింక్ ద్వారా ఎట్టి పరిస్తితి లో కేవైసి అప్డేట్ చేయవద్దు, ఇలా చేస్తే సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఎకౌంటు సమాచారం వెళుతుంది.

ఒక‌వేళ ఇంత‌కు ముందున్న కేవైసీకి, ప్ర‌స్తుత కేవైసీకి ఏమైనా మార్పులు ఉంటే.. అటువంటి వారు నేరుగా బ్యాంకు బ్రాంచికి వెళ్లి మాత్ర‌మే కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇటువంటి వారు కేవైసీకి సంబందించిన అన్ని ఒరిజిన‌ల్ ప‌త్రాల‌ను, బ్యాంకు అడిగిన ఇత‌ర డాక్యుమెంట్లు, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోని కూడా వెంట తీసుకెళ్లాలి.

కేవైసీ అప్‌డేష‌న్‌కు అంగీక‌రించే ప‌త్రాలు..

పాస్‌పోర్ట్‌

ఓట‌ర్ ఐడీ

డ్రైవింగ్ లైసెన్స్‌

ఆధార్ లెట‌ర్‌/ కార్డ్‌

ఎన్ఆర్ఈజీఏ కార్డ్‌

పాన్ కార్డ్‌

పైన తెలిపిన ప‌త్రాల‌లో ఏదైనా ఒక‌టి గుర్తింపు/చిరునామా ఫ్రూఫ్ కోసం ఇవ్వొచ్చు.

మైన‌ర్ ఖాతా విష‌యంలో..

ఎస్‌బీఐ మైన‌ర్ల‌కు కూడా పొదుపు ఖాతాల‌ను అందిస్తోంది. ఒక‌వేళ 10 ఏళ్లలోపు పిల్ల‌లు వారి త‌ల్లిదండ్రులు ఖాతాను నిర్వ‌హిస్తుంటే.. ఖాతాను నిర్వ‌హించే వ్య‌క్తి గుర్తింపు ప‌త్రాల‌ను కేవైసీ అప్‌డేష‌న్ కోసం ఇవ్వ‌చ్చు. ఒక‌వేళ 10 ఏళ్లలోపు పిల్ల‌లు స్వ‌తంత్రంగా ఖాతాను నిర్వ‌హిస్తుంటే.. పైన తెలిపిన ప‌త్రాల‌లో వారికి సంబంధించిన గుర్తింపు ప‌త్రాల‌ను ఇవ్వొచ్చు.

Leave a Comment