మొక్కలు పర్యావరణాన్ని కాపాడతాయి.మొక్కలు అధికంగా ఉన్న చోట వర్షాలు అధికంగా కురుస్తాయి.మొక్కలు కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకొని,ఆక్సిజన్ను ఇస్తాయి.గాలిలో ఆక్సిజన్ ఉన్న ప్రాంతంలో నివాసముండే ప్రజలు ఆరోగ్యo గా ఉంటారు.ఇంకా మొక్కలు నేలకోత కాపాడతాయి.అన్ని రకాల ఆహారం మొక్కల నుండే వస్తుంది.ఇన్ని ఉపయోగాలు ఉండే మొక్కలను అన్ని చోట్ల నాటుతారు.ప్రభుత్వలు మొక్కలు పెంచడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాయి. కానీ ఒక మొక్క పర్యావరణ వేత్తలను దడ పుటిస్తుంది. ఏమిటి ఆ మొక్క?దాని దుష్పరిణామాలు చూద్దం.
కోనో కార్పస్(Conocarpus):-
ఈ మొక్క పేరు వింటేనే పర్యావరణ ప్రేమికులు,వృక్ష శాస్త్రవేత్తలు హడలిపోతున్నారు. ఆక్సిజన్ విరివిగా విడుదల చేస్తుందని ఈ మొక్కను ప్రతిచోట నాటుతున్నారు.పలు మున్సిపాల్టిలలో సుందరికరణ కోసం దీనిని పెంచుతున్నారు.వీటితో పర్యావరణానికి పలు విధాలుగా విఘాతం కలుగుతుందని నిపుణుల అభిప్రాయం.ఈ మొక్క వల్ల,ప్రజల్లో శ్వాసకొస సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నిటారుగా,ఏపుగా పెరిగి పచ్చదనాన్ని ఇచ్చే ఈ మొక్క యొక్క దుష్పరిణామాలు ఇపుడిప్పుడే వెలుగులోకి వచ్చాయి.
అసలు ఈ మొక్క కథ ఏమిటి ?
ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాల్లో , తీర ప్రాంతాల్లోని మడ ( సముద్రం నదులు కలిసి ముఖద్వారాల వద్ద ఉండే ) అడవుల్లో ఇవి పెరుగుతాయి.కోనోకార్పస్ మొక్కలో అనేక ఉపజాతులున్నాయి.వీటిని మాంగ్రూవ్ మొక్కలనీ పిలు స్తారు . తీర ప్రాంతాల్లో పెరగడం వల్ల నిత్యం ప్రవా హాలను తట్టుకునేందుకు వీలుగా వీటి వేర్లు బురదనేలల్లోకి అనేక మీటర్ల లోతుకు వెళ్లి నాటుకుని , మొక్కకు స్థిరత్వమిస్తాయి . ఫలితంగా తీర ప్రాం తాల్లోని నీటి ప్రవాహాల వేగాన్ని ఇవి అడ్డుకుం టాయి . తక్కువ కాలంలో ఏపుగా పెరగడం , వేర్లు లోతుకు పాతుకుపోవడంతో ఇది ప్రతీ రుతువు లోనూ పచ్చదనంతో కళకళలాడుతుంది.
ఎక్కడ పెంచుతున్నారు?
ప్రస్తుతం ఈ మొక్కను ఆసియా,ఆఫ్రికా దేశాల్లోని కార్పొరేషన్లలో మరియు మున్సిపాల్టిలలో పెంచుతున్నారు.ఈ మధ్య మన రాష్ట్రలలో సుందరికరణ కోసం పెంచడం మొదలుపెట్టారు.ఈ మొక్క గురించి అధ్యయనం చేసిన ప్రభుత్వం,దీనిని నిషేదించింది.నర్సరి లలో పెంచవద్దని, రోడ్ల పక్కన మరియు మరెక్కడా నాట వద్దని ప్రభుత్యం ఆదేశించింది.కాని కొంతమంది ఆక్సిజన్ విరివిగా ఇస్తుందని తమ ఇండ్లలో నాటుతున్నారు.
Cono carpus (కోనో కార్పస్) దుష్పరిణామాలు.
ఈ మొక్క నాటిన అతికొద్ది వారాల్లోనే ఏపుగా పెరుగుతుంది. కోనోకార్పస్ మొక్క పుష్పాల నుంచి వెలువడే పుప్పొడి వల్ల అలర్జీ , శ్వాసకోశ , ఆస్తమా సమస్యలు వస్తున్నా యని శాస్త్రవేత్తల పరిశో ధనల్లో తేలింది . వీటి పేర్లు లోతుకంటూ పాతుకుపోతూ .. మధ్యలో అడ్డు వచ్చే కమ్యూనికేషన్ కేబుళ్లు , డ్రైనేజీ లైన్లు , మంచినీటి వ్యవ స్థలను ధ్వంసం చేస్తున్నాయని గుర్తించారు. ఈ మొక్కతో కీటకాలకు , పక్షులకు ఎలాంటి ఉపయోగం లేదు . వీటిపై పక్షులు గూళ్లు కట్టవు . పుప్పొడిపై సీతాకోకచి లుకలూ వాలవు . ఏ జంతువూ దీని ఆకులను తినవు . పర్యావరణ వ్యవస్థలో ఈ మొక్కతో ఎలాంటి ఉపయోగం లేకపోగా , అనేక దుష్ప్రభావాలు మాత్రం కలుగజేస్తుంది