Income Tax e-filing 2023

Income Tax e-filing 2023

Income Tax e-filing 2023 | Important information About Income Tax E- Filing – (2022 – 23) Financial Year ✍️
———————————————————————————————————————-
💥మనము Salary పొందిన 2022 -23 Financial Year Data ను ప్రస్తుత 2023 -24 లో ఈ -Filing చేసుకుంటాము.

➡️ఈవిధంగా E-Filing చేసుకునే 2023 -24 Year ను Assessment Year గా అర్థం చేసుకోవాలి..Employess Tax పడనప్పటికీ ( Zero TaX) కూడా E- Filing చేసుకోవాలి.
—————————————–
💥అందరు ఉద్యోగులు E-Filing ను Income Tax Dept. మనకు సూచించిన గడువు తేదీ లోగా తప్పక చేసుకోవాలి… లేదంటే మళ్లీ Fine కట్టి చేసుకోవలసి రావచ్చు… క్రింది Matter చదవండి.
—————————————–
💥దయచేసి ఓపిక తో మొత్తం  జాగ్రత్తగా చదవండి… IT గురించి

ఒక మంచి అవగాహన వస్తుంది.ఉద్యోగం మరియు IT విషయంలో క్లారిటీగా వుండటానికి అవకాశం వుంటుంది.
————————————-
INFORMATION ABOUT⬇️

1)Income Tax Cut అయ్యాక ఎం చేయాలి
2)TDS అంటే ఎంటి..?
3) – E-Filing ఎందుకు చేయాలి..? ఎవరు చేయాలి..? ఎప్పుడు చేయాలి..?
———————————————
అసలు E – Filing అంటే ఏమిటో చూద్దాము..

అసలు E – Filing ఎపుడు చేస్తాం..❓

E – Filing ఎవరు చేయాలి…❓
అంటే,
DDO చేయాలా…❓లేక Employee వ్యక్తిగతంగా చేసుకోవాలా…❓
ఇంతకీ మనకు జీతం ఇచ్చే వారికి ( DDO)
IT విషయంలో వారి బాధ్యత ఏ మిటి…❓❓ చూద్దాం.
—————————————-
జీతం ఇచ్చే వారిని లేదా Salary Bill చేసే వారిని Drawing & Disbursing officer లేదా DDO అంటారు.
—————————————-
మన జీతం లో ప్రతీ నెలా లేదా February నెలలో మన సంవత్సర Salary మొత్తం ని బట్టి Income tax లెక్క చేసి Tax Amount Cut చేస్తారు.
—————————————
Tax ను జీతం నుండి మినహాయించి న తర్వాత
DDO లు Certified Charted Accountant దగ్గర ప్రతి మూడు నెలలకు ఒకసారి TDS చేయించాలి.

TDS అంటే Tax Deducted At Source.
అంటే ఎంత TAX ప్రతినెలా cut చేశారు అన్న విషయం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న Income Tax Department కు తెలియచేయడం అన్నమాట.
DDO తన కింద వున్న Employees కు Deduct చేసిన TAX వివరాలు ప్రతీ 3 నెలలకు ఒకసారి CA దగ్గర TDS చేయించాలి. Yearly ఇది 4 సార్లు DDO లు చేయించాలి.
దీనితో DDO ల బాధ్యత పూర్తి అవుతుంది.
—————————————-
డిసెంబరు,జనవరి, ఫిబ్రవరి నెలలు అంటే 4 వ క్వార్టర్ TDS పూర్తి అయినాక
Employees తాము స్వంతంగా
E – Filing చేయించు కోవాలి.
E- Filing అనునది DDO లకు సంబంధం లేదు.
E – Filing లో మనం ఏ ఏ Sections కింద ఎంత ఎంత exemption తీసు కున్నాము..❓
అన్ని విషయాలు సవివరంగా IT portal లో ఎంటర్ చేసి DDO లు
మనకు ఇచ్చే Form – 16 కు అదనంగా IT Dept నుండి ఇంకో Form – 16 వస్తుంది.
————————————-
అంటే DDO లు ఒక Employee
– ఒక Financial Year లో Total ఎంత Tax Deduct చేశాడో, TDS ద్వారా IT Dept కు తెలియచేస్తే,
..Employee ఆ కట్టిన TaX ను E – Filing చేయడం ద్వారా….
తన Gross వివరాలు, ఏ ఏ Sections కింద ఎంత టాక్స్ Exemption తీసుకున్నాడో
ఆ వివరాలు – మరియు PAN Card ద్వారా మనకు వచ్చిన అదనపు ఆదాయం వివరాలు అన్ని కూడా సవివరంగా… IT Dept కు తెలియజేసి తను కట్టిన టాక్స్ సరిగ్గానే కట్టాను అని IT Dept కు వివరాలు సమర్పించడమే E – Filing Process.

ఒక వేళ ఎక్కువ TAX కట్టి వుంటే ఆ amount తిరిగి మన బ్యాంక్ అకౌంట్ ద్వారా వెనక్కి వస్తుంది.
———————————-
DDO లు TDS పూర్తి చేశాక
కొంతమంది Teachers లేదా Employees YouTube లోని వీడియోలు చూసి, స్వంతంగా E – Filing ను Mobiles లో లేదా తెలిసిన Net Center 100 – 150 Rupees చెల్లించి చేయిస్తుంటారు. వారి Responsibility కూడా అప్పటివరకు మాత్రమే వుంటుంది..
అలా కాకుండా మంచి Perfect knowledge వున్న Charted Accountant ( CA)/ IT పై పూర్తి అవగాహన ఉన్న వారి తో E – Filing చేయించండి…
———————-
కొంత మంది Teachers E – Filing చేయించడం అవసరమా అని మాట్లాడుతుంటారు..
———————–
E – Filing అవసరం లేదు అని సలహాలు ఇచ్చేవారు ఎవరైనా , వుంటే వారికి Income Tax పట్ల సరైన అవగాహన లేదు అని అర్థం.
———————————-
కొంత మంది Teachers కు TAX పడదు.అంటే February లో Form – 16 చేయించి నపుడు TAX , Rs 0 ( Nil) గా రావచ్చు. టాక్స్ Zero అంటే మనం చూయించిన Deductions ను బట్టి అలా టాక్స్ Nil వస్తుంది.కొంతమంది Teachers లేదా Employees వాదన ఏమిటి అంటే మాకు TAX పడలేదు కాబట్టి, E- Filing అవసరం లేదు అని వాదిస్తారు..

అది కరెక్ట్ ,మనం చేసిన Form – 16 లో టాక్స్ amount Zero కానివ్వండి…లేక Tax పడిందే అనుకోండి..February లో మన DDO ఇచ్చిన  ఆ ఫామ్ – 16 ను ఆన్లైన్ లో E- Filing ( Electronic Filing) ద్వారా upload చేస్తాము.ఐటీ Dept వారు దానిని పరిశీలించి మన Earnings & Deductions కోసం సబ్మిట్ చేసిన Receipts Correct గా వున్నచో ,మనకు IT Dept నుంచి ఇంకో ఫామ్ – 16 వస్తుంది.

కేంద్ర ప్రభుత్వ income Tax Department సూచనలు అనుసరించి టాక్స్ పడినా… ఒక వేళ అసలు టాక్స్ పడకపోయినా కూడా E – Filing తప్పక చేయించుకోవాలి.

March వరకు Salary తీసుకున్న తర్వాత E – Filing చేసుకోవాలి. లేదంటే IT Dept నుండి  నోటీసులు తప్పవు.. తర్వాత మనకు Housing / Personal/Car Loan తీసుకునేటప్పుడు, మన DDO ఇచ్చిన ఆ ఫామ్ – 16 తో పాటు E- Filing ( Electronic Filing) ద్వారా upload చేసిన ఫామ్ – 16 ఉంటే మంచిది.

ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ చేయని వారికి మెసేజెస్ కూడా అప్పుడప్పుడూ వస్తుంటాయి.కావున ఉపాధ్యాయులు/ ఉద్యోగులు అందరూ చివరి తేదీ వరకు వెయిట్ చేయకుండా త్వరపడి ఈ ఫైలింగ్ పూర్తి చేసుకోగలరు.

సమయం ఉంది అనుకుంటే సర్వర్ బిజీ అవుతుంది. కావున ఇప్పుడే AY 2022-23 కి సంబంధించి త్వరగా ఈ ఫైలింగ్ చేసుకోగలరు.

E-Filing Link కొరకు క్లిక్ చేయండి.

E – Filing Complete చేయడానికి కావలసినవి.
  1. PAN Number
  2. E-filing Password
  3. Mail Id
  4. Aadhar Link వున్న మొబైల్ నంబర్

E-filing Password మర్చిపోతే Reset చేయవచ్చు, Aadhar Link వున్న మొబైల్ నంబర్ కు వచ్చే OTP తో , E – Filing Password Reset చేయవచ్చు మరియు E-Verification కొరకు Aadhar Link వున్న మొబైల్ నంబర్ కావాలి.

Last Date: 31-07-2023

Leave a Comment