How to Apply PAN card

How to Apply PAN card

మీ PAN కార్డ్ -మీరే అప్లై చేయవచ్చు

పాన్ కార్డు ఈ రోజుల్లో ముఖ్యమైన గుర్తింపు కార్డ్ మరియు మీ అనేక ఆర్ధిక కార్యకలాపలకు ఇది అత్యవసరం,కొత్త బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలన్న, బ్యాంకు లోన్ తీసుకోవాలన్న,అత్యధిక మొత్తం బదిలీ చేయాలన్న,ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్న పాన్ కార్డు అవసరం.
 

మనమే అప్లై చేసుకోవచ్చా? 

కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటె,మీరే డెస్క్ ట్యాప్, ల్యాప్ ట్యాప్ లేదా స్మార్ట్ ఫోన్ లో నేరుగా ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.ఒక వ్యక్తి ఒక్క పాన్ కార్డ్ మాత్రమే కల్గి ఉండాలి, ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్ లు కల్గి ఉంటె ఇన్కమ్ టాక్స్ చట్టం 1961 సెక్షన్ 272B  ప్రకారం Rs 10,000/- జరిమానా విధిస్తారు.
 

PAN CARD ఎప్పుడు, ఎలా వస్తుంది?

అప్లై చేసిన ఒకటి లేదా రెండు రోజుల్లో మీ మెయిల్ కు పాన్ కార్డ్ సాఫ్ట్ కాపీ వస్తుంది,ఈ కాపీ ని జిరాక్స్ తీసి వాడుకో వచ్చు పాన్ కార్డు పోస్ట్ లో 10 రోజుల్లో వస్తుంది.


అప్లై చేయడానికి కావాల్సిన Documents

  • ఆధార్ కార్డ్
  • ఆధార్ కార్డ్ తో లింక్ అయిన మొబైల్ ( నెంబర్)
  • మెయిల్ ఐడి 
  • ఆన్లైన్ పేమెంట్ చేయడానికి మీ మొబైల్ లో ఏదైనా UPI యాప్ ( Google pay, Phonepe, BHIM మొదలైన) 

ముఖ్య గమనిక:-

మీ స్కూల్ సర్టిఫికెట్స్ లో ఉన్న, ఇంటి పేరు, పేరు, పుట్టిన తేది, మీ ఆధార్ లో ఉండాలి., లేక పొతే ఆధార్ ని మార్చుకోండి, ఎందుకంటే ఆధార్ లో ఉండే వివరాలే పాన్ కార్డ్ లో వస్తాయి.

ఫీజు ఎంత?

  • సాఫ్ట్ కాపీ కోసం ఫీజు లేదు.
  • ఫిజికల్ కాపీ కోసం Rs 106.90

అప్లై చేసే విధానం?

ముందుగా ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.

స్టెప్-1  Apply online పై క్లిక్ చేయాలి.

 
స్టెప్-2  Application type దగ్గర New PAN -Indian Citizen (Form- 49A) సెలెక్ట్ చేయాలి.
 
స్టెప్-3   Category దగ్గర INDIVIDUAL సెలెక్ట్ చేయాలి.
 
స్టెప్-4   Title లో  Shri, లేదా Smt, లేదా  Kumari  సెలెక్ట్ చేయాలి.
 
స్టెప్-5  Surname ,  First name,  Middle name, మీ ఆధార్ కార్డ్ లో ఉన్న విధంగా రాయాలి.
              ( ఇక్కడ జాగ్రతగా రాయాలి, ఒకోసారి Surname, First name గా, First                                         name, Surname, గా ఆధార్ కార్డ్ లో ఉండవచ్చు.)
 
స్టెప్-6   Date of birth మరియు Mail మరియు Mobile Number( ఆధార్ తో లింక్ ఉన్న                     నెంబర్)
Token Number జనరేట్ అవుతుంది, మళ్ళి క్రింది లింక్ పై క్లిక్ చేసి ఈ సారి Registered User సెలెక్ట్ చేసి, Token Number, Mail ,మరియు Date of birth , Enter చేయాలి.
 
 
తరువాత పేజీ లో  ఆధార్ కార్డ్ లోని ఆఖరి నాలుగు నెంబర్లు, అడ్రస్, ( ఆటోమేటిక్ గా ఆధార్ కార్డ్ లోది తీసుకుంటుంది) Country Select చేయండి.
 
తరువాత పేజిలో మీ జిల్లా ,సర్కిల్, ఏరియా సెలెక్ట్ చేయాలి.
 
 తరువాత పేజిలో ఆధార్ కార్డ్ లోని మొదటి ఎనిమిది నెంబర్లు రాసి, e-verification చేయడానికి, మీ ఆధార్ లింక్ మొబైల్ కి OTP వస్తుంది.
 
 తరువాత ఆన్లైన్ పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఏదైనా UPI యాప్ ( Google pay, Phonepe, BHIM మొదలైన) పేమెంట్ చేయాలి. 
 
ఫైనల్ గా అప్లికేషను రివ్యూ చేసి ఫైనల్ సబ్మిట్ చేయాలి.
 
 

1 thought on “How to Apply PAN card”

Leave a Comment