Google translate App
నేడు ఇంగ్లీషు మన జీవితం లో భాగం అయింది,ఇంగ్లిష్ లో మాట్లాడే వారిని అలానే చూస్తూ ఉంటాము, మనం కూడా అలా మాట్లాడితే బాగుండును అనిపిస్తుంది. స్కూల్ ఏజ్ లో ఇంగ్లిష్ నేర్చుకొని ఉండాల్సింది అనిపిస్తుంది.కొంత మంది మన అప్పుడు ఇంగ్లిష్ మీడియం లేదు లేకపోతేనా!అంటారు.
మీరు బాగా మాట్లాడకపోయినా,అత్యావసర సమయంలో,ఎదుటి వారికి ఇంగ్లిష్ తప్ప మరో భాష రానప్పుడు, మీ కావలసిన పనిని వారికి చెప్పడానికి, ఈ యాప్ వరం లాంటిది.
ఇది గూగుల్ ద్వారా రూపొందించిన యాప్, కాబట్టి సెక్యూరిటీ కి దోకలేదు.దీనిని ఉపయోగించడం కూడా చాలా సులువు.మీ స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్ ను ఇంస్టాల్ చేయవచ్చు. ఏ భాష నుంచి అయినా మరో భాష కు అనువాదం (translate) చేయవచ్చు .
- google translate English to Telugu (ఇంగ్లిష్ నుంచి తెలుగు)
- google translate English to Hindi (ఇంగ్లిష్ నుంచి హిందీ )
- google translate English to Urdu ( ఇంగ్లిష్ నుంచి ఉర్దు)
(లేదా)
- google translate Telugu to English ( తెలుగు నుంచి ఇంగ్లిష్)
- google translate Hindi to English ( హిందీ నుంచి ఇంగ్లిష్)
- google translate Urdu to English ( ఉర్దు నుంచి ఇంగ్లిష్)
Google play Store లోకి వెళ్లి google translate అని టైపు చేసి ఇంస్టాల్ చేయాలి.
ఈ యాప్ ఉపయోగాలు.
- వాయిస్ చెప్పి translate చేసుకోవచ్చు.
- మొబైల్ లోని తెలుగు కీ బోర్డు ద్వారా టెక్స్ట్ రాసి translate చేసుకోవచ్చు.
- పేపర్ లేదా బుక్ పేజి ని స్కాన్ చేసి translate చేసుకోవచ్చు.
- మొబైల్లో ఫోటో ని అప్లోడ్ చేసి ,దాని translate చూడవచ్చు
- Translate చేసిన వ్యాక్యాన్ని, పక్కన ఉన్న వాయిస్ బటన్ క్లిక్ చేసి వాయిస్ వినవచ్చు.
- ఉచ్చారణ సరిగా రాని పదాలను టైపు లేదా స్కాన్ చేసి సరి అయిన ఉచ్చారణ వినవచ్చు.