Aadhar PAN Link
పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం… కేంద్రం కీలక ప్రకటన…!
ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం, మినహాయింపు వర్గం కిందకు రాని పాన్ కార్డు హోల్డర్లందరూ 31 మార్చి 2023లోగా పాన్, ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి అని పేర్కొంది. లేని పక్షంలో 1ఏప్రిల్ 2023 నుంచి ఆయా పాన్ కార్డులు పనిచేయవని పేర్కొంది.
మే 2017లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, అసోం, జమ్మ కశ్మీర్, మేఘాలయ రాష్ట్రాల్లో నివసిస్తున్న వ్యక్తులు, ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం నాన్-రెసిడెంట్, మునుపటి సంవత్సరంలో ఎప్పుడైనా 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, భారతదేశ పౌరుడు కాని వ్యక్తులు మినహాయింపు వర్గం కిందకు వస్తారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) మార్చి 30న జారీ చేసిన సర్క్యులర్‌లో… ఒకసారి పాన్ పనిచేయకపోతే, ఐటీ చట్టం ప్రకారం ఆ తర్వాత జరగబోయే పరిణామాలకు సదరు వ్యక్తి బాధ్యత వహించాల్సి పేర్కొంది. దీంతో పాటు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వుంటుందని తెలిపింది.
పెనాల్టీ ఏంత కట్టాలి?
అలా చేయకపోతే 2022 జూన్ 30 లోపు పెనాల్టి 500/- కట్టి లింక్ చేసుకోవాలి. తరువాత ఆధార్ తో పాన్ లింక్ చేయాలంటే 1000/- పెనాల్టి కట్టి లింక్ చేసుకోవాలి. చలనా ITNS 280 ద్వారా ఈ క్రింది హెడ్ అఫ్ అకౌంట్స్ క్రింద చలనా కట్టాలి.
మేజర్ హెడ్ ( కంపెనీలు కాకుండా) – 0021
మైనర్ హెడ్ – 500(fee)
పెనాల్టీ కట్టకపోతే పాన్ కార్డ్ పనిచేయదా?
ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 వరకు ఐటి రిటర్న్స్ ఫెయిల్ చేయడం.రీఫండ్లు క్లెం చేయడం ,ఇతర ఐటి సేవలను వినియోగించదానికి పాన్ కార్డ్ మరో ఏడాది పాటు పనిచేస్తాయి.
ఆధార్ తో పాన్ లింక్ చేయక పొతే నష్టం ఏమిటి?
మీ పాన్ కార్డు పనిచేయక పోవచ్చు.ఈ సమస్య వల్ల మీ బ్యాంకు ఎకౌంటు నుంచి అధిక మొత్తం లో డ్రా చేయడం కాని బదిలీ చేయడం కాని చేయలేరు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ లలో పెట్టుబడి పెట్టలేరు.
బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడం కోసం చెల్లుబాటు కాని పాన్ కార్డ్ ను ఇస్తే ఆదాయపు పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 272B ప్రకారం ..అసేస్సింగ్ అధికారి సదరు వ్యక్తి కి పది వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించవచ్చు.