Aadhaar PAN LINK కాకపొతే 1000/- పెనాల్టీ కట్టాలా?
ఇన్కంటాక్స్ డిపార్టుమెంటు ఆధార్ తో పాన్ లింక్ తప్పని సరి చేసింది.పెనాల్టి లేకుండా ఈ గడువు మార్చ్ 31, 2022 తో ముగిసింది. అయితే ఈ గడువు కొంత పెనాల్టి తో మరికొన్ని రోజులు పెంచింది.
అసలు నిబంధనలు ఏమి చెపుతున్నాయి?
CBDT F.No 370142/14/22-TPL తేది 30 మార్చ్ 2022, ఆదేశాల ప్రకారం 2017 జూలై 1 కంటే ముందు పాన్ కార్డు కల్గిన అందరు 2022 మార్చ్ 31 కంటే ముందు వారి ఆధార్ నంబర్ ను PAN కార్డ్ తో లింక్ చేసుకోవాలి.
పెనాల్టీ ఏంత కట్టాలి?
అలా చేయకపోతే 2022 జూన్ 30 లోపు పెనాల్టి 500/- కట్టి లింక్ చేసుకోవాలి. తరువాత ఆధార్ తో పాన్ లింక్ చేయాలంటే 1000/- పెనాల్టి కట్టి లింక్ చేసుకోవాలి. చలనా ITNS 280 ద్వారా ఈ క్రింది హెడ్ అఫ్ అకౌంట్స్ క్రింద చలనా కట్టాలి.
మేజర్ హెడ్ ( కంపెనీలు కాకుండా) – 0021
మైనర్ హెడ్ – 500(fee)
పెనాల్టీ కట్టకపోతే పాన్ కార్డ్ పనిచేయదా?
ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 వరకు ఐటి రిటర్న్స్ ఫెయిల్ చేయడం.రీఫండ్లు క్లెం చేయడం ,ఇతర ఐటి సేవలను వినియోగించదానికి పాన్ కార్డ్ మరో ఏడాది పాటు పనిచేస్తాయి.
ఆధార్ తో పాన్ లింక్ చేయక పొతే నష్టం ఏమిటి?
మీ పాన్ కార్డు పనిచేయక పోవచ్చు.ఈ సమస్య వల్ల మీ బ్యాంకు ఎకౌంటు నుంచి అధిక మొత్తం లో డ్రా చేయడం కాని బదిలీ చేయడం కాని చేయలేరు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ లలో పెట్టుబడి పెట్టలేరు.
బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడం కోసం చెల్లుబాటు కాని పాన్ కార్డ్ ను ఇస్తే ఆదాయపు పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 272B ప్రకారం ..అసేస్సింగ్ అధికారి సదరు వ్యక్తి కి పది వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించవచ్చు.
పెనాల్టీ కట్టదానికి ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.