10th Public Exams-2024 (పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల)
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.
లోక్ సభ ఏన్నికలషెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ చివరి నెలలో జరగాలి. ఈ కారణంగా అన్ని పరీక్షలు అన్ని ముందే జరిగే విధంగా ప్రణాళిక సిద్దంచేసింది తెలంగాణా విద్యాశాఖ,మొన్న ఇంటర్ పరీక్షల తేదీలు ప్రకటించారు.ఈ రోజు పదవ తరగతి (TS 10th Exams) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.
తేదీలు:
మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ షెడ్యూల్ విడుదల చేసింది.
సమయం:
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి.
ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలలో మార్పులు:
గత సంవత్సరం సైన్సు పరీక్ష ఒకే రోజు పెట్టారు.ఈ ఏడాది మార్చ్ లో జరగబోయే పరీక్షల్లో ఫిజికల్ సైన్సు పరీక్ష ఒకరోజు, బయాజికల్ సైన్సుపరీక్ష మరో రోజు ఉంటుంది. గత సంవత్సరం ఈ రెండు పరీక్షలు ఒకే రోజు 20 నిమిషాలు గ్యాప్ ఇచ్చి నిర్వహించారు. చాలా మంది సైన్సు సబ్జెక్టు లో ఫెయిల్ అయ్యారు, విద్యాశాఖ పై అనేక విమర్శలు వచ్చాయి, ఈ కారణంగా ఈ సంవత్సరం సైన్సు పరీక్ష రెండు రోజులు పెట్టారు.