Know your Mobile Validity మీ మొబైల్ ఫోన్ యొక్క వ్యాలిడిటీ (చెల్లుబాటు) తెలుసుకోండి. మీ దగ్గర ఉన్న ఫోన్ లేదా మీరు కొనే ఫోన్ చెల్లుబాటును తెలుసుకోవచ్చు. ఈ మధ్య మొబైల్ దొంగతనాలు ఏక్కువ అయ్యాయి.దొంగిలించిన మొబైల్స్ నుIMEI తిరిగి అమ్ముతున్నారు.ఈ మొబైల్ మనకు తెలియకుండా కొంటున్నాము. వీటి చెల్లుబాటు ప్రశ్నానార్దకం.
మొబైల్ పోయిన వ్యక్తి తన మొబైల్ పోయిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అండర్ లో పనిచేసే CEIR ( Center Equipment Identity Register) లో రిజిస్టర్ చేసి ఉంటే బ్లాక్ లిస్టు లో ఆ మొబైల్ చూపిస్తుంది.
Know your Mobile Validity, తెలుసుకోవడానికి మొబైల్ IMEI (International Mobile Equipment Identity) తెలియాలి, దీనిలో 15 అంకెలు ఉంటాయి. మొబైల్ లో రెండు సిమ్ కార్డులు ఉంటే, ఆ మొబైల్ కు రెండు IMEI ఉంటాయి, ఏదైనా ఒక IMEI నెంబర్ తెలిస్తే చాలు.
IMEI (International Mobile Equipment Identity)
IMEI (International Mobile Equipment Identity) తెలుసుకునే విధానాలు,
- మొబైల్ ప్యాకింగ్ బాక్స్ పై IMEI ఉంటుంది.
2. మొబైల్ కొన్న బిల్ పై IMEI ఉంటుంది.
3. మొబైల్ నుండి *#06# డైల్ చేస్తే స్క్రీన్ పై IMEI కనబడుతుంది.
Know your Mobile Validity, తెలుసుకోవడం ఏలా?
ఈ క్రింది విధంగా చేస్తే, ఆ మొబైల్ బ్లాక్ లిస్టు లో ఉందా, డుప్లికేట్ మొబైల్ లా లేదా వాడుకలో ఉన్నదా తెలుస్తుంది.
1. మీ మొబైల్ నుంచి KYM <15 అంకెల IMEI> టైప్ చేసి 14422 SMS పంపాలి.
2.ఈ లింక్ మొబైల్ నెంబర్ టైప్ చేయండి, మొబైల్ కు OTP వస్తుంది, OTP ఎంటర్ చేసి తరువాత IMEI నెంబర్ ఎంటర్ చేయండి. https://www.ceir.gov.in/IMEIVerifyServlet
3. PLAY STORE నుంచి KYM APP ను డౌన్లోడ్ చేసుకొని IMEI నెంబర్ ఎంటర్ చేసి అయినా తెలుకోవచ్చు.