ఆన్‌లైన్‌లో మీ ఆధార్ వివరాలు అప్‍డేట్ చేయండిలా
ఆధార్ ఈ రోజు ముఖ్యమైన గుర్తింపు కార్డు, ఈ ఆధార్ లో మార్పులు చేసుకోవాలసిన అవసరం ఉండవచ్చు, మీ పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ మొదలైనవి మార్పులు మీరే అప్డేట్ చేసుకోవచ్చు. దీని కోసం కావలసిన ధ్రువ పత్రాలు ముందుగా సిద్దం చేసుకొని వాటిని స్క్రాన్ చేసి పెట్టుకోవాలి.
కావలసిన ధ్రువ పత్రాల List కోసం ఈ క్రింది PDF డౌన్లోడ్ చేయండి.
https://drive.google.com/file/d/1I3IbFhnwNZVQwrYImmUf4LplOw9AGUac/view?usp=share_link
ఆధార్ లో సరిచేయవలసిన వివరాలను ఈ క్రింది పేపర్ డౌన్లోడ్ చేసుకొని నింపి గెజిటెడ్ ఆఫీసర్ తో సంతకం చేయించాలి. మరియు సపోర్టింగ్ డాక్యుమెంట్ స్క్రాన్ చేసుకొని ఈ క్రింది విధంగా చేయండి.
https://drive.google.com/file/d/1e1aV1hqKVOVPsseAC4PvwkcvKBgp7H_p/view?usp=share_link
Step 1- ముందుగా https://myaadhaar.uidai.gov.in/ ఓపెన్ చేయాలి.
Step 2- Login పై క్లిక్ చేయండి.
Step 2- మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ మొబైల్ కు OTP వస్తుంది. OTP ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
Step 3- Online Update Services పైన క్లిక్ చేయాలి.
Step 4- ఆ తర్వాత Update Aadhaar Online పైన క్లిక్ చేయాలి.
Step 5- Proceed to Update Aadhaar పైన క్లిక్ చేయాలి.
Step 6- పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆప్షన్స్‌లో మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 7- మీ వివరాలు అప్‌డేట్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
పేమెంట్ చేసి ప్రాసెస్ పూర్తి చేయాలి.
ఎంఆధార్ యాప్ ఉన్నవాళ్లు ఆధార్ అప్‌డేట్ కోసం ఇవే స్టెప్స్ ఫాలో కావచ్చు. పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలు కాకుండా.,
మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, రిలేషన్‌షిప్ స్టేటస్, ఐరిస్, ఫింగర్‌ప్రింట్, ఫోటో అప్‌డేట్ చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది.