CIVIL SERVICE-2021 TOPERS MARKS (సివిల్స్‌ సాధించడం కష్టమా?.. ఈ టాపర్ల మార్కులు ఏమి చెపుతున్నాయి)

CIVIL SERVICE-2021 TOPERS MARKS

సివిల్స్‌ సాధించడం కష్టమా?.. ఈ టాపర్ల మార్కులు ఏమి చెపుతున్నాయి.

సివిల్‌ సర్వీస్‌ పరీక్ష రాసి ,ప్రజాసేవ చేయాలని ఏవరికి ఉండదు.ఎంతోమంది అభ్యర్థులు సాఫ్ట్వేర్ కంపినిల్లో అధిక వేతనాలు పొందుతూ, ఆ కొలువుకు రాజీనామా చేసి సివిల్స్ కు ప్రిపేర్ అవుతుంటారు. కాని దీన్ని సాధించటం అంత తేలికకాదు. లక్షల మంది  ప్రిలిమ్స్‌ రాస్తే.. చివరకు ఎంపికయ్యేది వందల్లోనే. దీన్ని సాధించాలంటే ఎంతో కృషి, పట్టుదలతో పాటు కఠోర శ్రమ అవసరం.గత తప్పిదాలను గుర్తించడం,పటిష్టమైన ప్రణాళిక,దానికి తగిన కార్యాచరణ ఉండాలి. ఇటీవల విడుదలైన యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష‌-2021 ఫలితాల్లో మొదటి మూడు ర్యాంకుల్లో అమ్మాయిలనే వరించాయి. శ్రుతి శర్మ మొదటి  ర్యాంకు కైవసం చేసుకోగా, రెండవ స్థానంలో  అంకితా అగర్వాల్‌, మూడవ  స్థానంలో గామినీ సింగ్లా నిలిచారు. అయితే, ఈ పరీక్ష ఎంత కష్టమో ఈ టాపర్లు సాధించిన మార్కులను బట్టి అర్థం చేసుకోవచ్చు. సివిల్స్ ఎంపికై, వారు సాధించిన మార్కుల వివరాలను యూపీఎస్సీ గురువారం విడుదల చేసింది. తొలి ర్యాంకర్ శ్రుతిశర్మ 54.56శాతం మార్కులు సాధించగా.. 51.85 శాతం మార్కులతో అంకిత అగర్వాల్‌ రెండో ర్యాంకు, 51.60 శాతం మార్కులతో గామినీ సింగ్లా మూడో  ర్యాంకు సాధించారు.. సివిల్స్‌-2021కు ఎంపికైన 685 మందిలో 508 మంది పురుషులు కాగా.. 177 మంది మహిళలు ఉన్నట్టు పేర్కొంది.

టాపర్లు సాధించిన మార్కులివే..

సివిల్స్‌ మెయిన్‌, ఇంటర్వ్యూలకు కలిపి మొత్తంగా 2025 మార్కులు ఉంటాయి. దీంట్లో మెయిన్‌/రాతపరీక్షకు 1750 మార్కులు, ఇంటర్వ్యూకి 275 మార్కులు చొప్పున కేటాయిస్తారు.

2021 సివిల్స్‌ పరీక్షలో తొలి ర్యాంకు సాధించిన శ్రుతి శర్మ మొత్తంగా 1105 మార్కులు (రాత పరీక్షలో 932 మార్కులు, ఇంటర్వ్యూలో 173 మార్కులు) సాధించినట్టు యూపీఎస్సీ వెల్లడించింది.

అలాగే,  రెండోవ ర్యాంకర్ ,అంకిత అగర్వాల్‌  మొత్తం 1050 మార్కులు సాధించారని (రాతపరీక్ష 871, ఇంటర్వ్యూ 179 మార్కులు),

మూడో ర్యాంకులో మెరిసిన గామినీ సింగ్లా 1045 మార్కులు (రాతపరీక్ష 858, ఇంటర్వ్యూ 187),

 నాలుగో ర్యాంకు సాధించిన ఐశ్వర్య వర్మ 1039 (రాత పరీక్ష 860, ఇంటర్వ్యూ 179 మార్కులు),

ఐదో ర్యాంకులో మెరిసిన ఉత్కర్ష్‌ ద్వివేది 1036 (రాతపరీక్ష 871, ఇంటర్వ్యూ 165) మార్కులు చొప్పున సాధించినట్టు యూపీఎస్సీ వివరించింది.

సివిల్ సర్విస్ పరిక్ష మూడు దశలలో ఉంటుంది

  •  ప్రిలిమినరీ
  • మెయిన్‌,
  • ఇంటర్వ్యూ

అఖిల భారత అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఎఫ్‌ఎస్‌ తదితర ఉద్యోగుల ఎంపిక కోసం యూపీఎస్సీ ఏటా మూడు దశల్లో సివిల్స్‌ పరీక్ష నిర్వహిస్తుంటుంది.,  సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష-2021 గతేడాది అక్టోబర్‌ 10న జరిగింది. మొత్తంగా 10,93,984 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 5,08,619మంది పరీక్ష రాశారు. వీరిలో 9,214 మంది అభ్యర్థులు ఈ ఏడాది జనవరిలో జరిగిన మెయిన్‌ పరీక్ష రాసేందుకు అర్హత సాధించారు. వీరిలో 1,821 మంది అభ్యర్థులు మాత్రమే  ఇంటర్వ్యూకు అర్హత సాధించారు.  చివరకు 685 మంది ఎంపిక  అయ్యారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూలను దాటుకొని ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌, సెంట్రల్‌ సర్వీస్‌ గ్రూప్‌-ఏ, బి పోస్టులకు మొత్తం 685 మంది ఎంపికయ్యారు. ఇందులో జనరల్‌ కోటాలో 244, ఈడబ్ల్యూఎస్‌లో 73, ఓబీసీలో 203, ఎస్సీ కోటాలో 105, ఎస్టీల్లో 60  మంది ఉన్నారు.

సివిల్స్-2021 ద్వారా మొత్తం  749 ఖాళీలను భర్తీ చేయనున్నారు,అందులో  180 IAS (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు)   200 IPS (ఇండియన్ పోలీస్ సర్వీసు)   37 IFS (ఇండియన్ ఫారన్ సర్వీసు)  ,  మిగిలినవి సెంట్రల్‌ సర్వీస్‌ గ్రూప్‌-ఏ, బి పోస్టులను భర్తీ చేస్తారు.

Click to Download Marks PDF

Leave a Comment