What is BIS HALLMARK916 Gold

What is BIS HALLMARK916 Gold . BIS HALLMARK బంగారం అంటే ఏమిటి? బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు.నేడు బంగారం లో ఇన్వెస్ట్మెంట్ చాలా మంది చేస్తున్నారు. బంగారం ఉంటె అవసరం అయినప్పుడు బ్యాంకు లో పెట్టి తక్కువ వడ్డీ తో ఋణం తీసుకోవచ్చు.వివిధ శుభకార్యాల కోసం బంగారం కొనడం మన సంప్రదాయం.కాని బంగారం గురించి విద్యావంతులకు కూడా అన్ని విషయాలు తెలియక నష్టపోతున్నారు.

బంగారం యొక్క విశిష్టత:

బంగారం (Gold) సింబల్  Au, పరమాణు సంఖ్య 79,  ఇది మూలకాల ఆవర్తన పట్టికలలో  D- Block మూలకం, దీని ద్రవీభవన స్టానం(MP) 1064.18C, భాష్భిభవన స్టానం(BP) 2970C. బంగారానికి ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాల వల్ల,ఇది మిగతా మూలకాల కంటే ప్రత్యేకమైనది.

Purity of Gold (బంగారం యొక్క స్వచ్చత ):

Purity of Gold (బంగారం యొక్క స్వచ్చత ) ను క్యారెట్ల లో  24K999, 22k916, 18k750,14k585, అని చెపుతారు.వీటి గురించి తెలుసుకుందాం. 24k (24క్యారెట్) అంటే స్వచ్చ మైన బంగారం,దీనిలో కూడా 100% బంగారం ఉండదు. 99.9% బంగారం మాత్రమే ఉంటుంది, దీనిని 999 పైనేస్ అంటారు.

24k999 (24క్యారెట్) అంటే స్వచ్చ మైన బంగారం విపరీతమైన సున్నితత్వం మరియు మృదుత్వం, కల్గి ఉంటుంది,అందువల్ల  స్వచ్ఛమైన బంగారం ఆభరణాలకు తగినది కాదు,అందువల్ల ఆభరణాలు తయారు చేయలేము.ఆభరణాలు తయారు చేయడానికి స్వచ్ఛమైన బంగారానికి ఇతర లోహాలు కలుపుతారు,మరియు ఆభరణాలను సోల్దరింగ్ చేయుటకు ఇతర లోహాల వాడకం అవసరం.జింక్ ,కాపర్ మొదలైనవి కలుపుతారు.ఇతర లోహాలు కలిపే దాని శాతాన్ని బట్టి బంగార్రాన్ని 22k916, 18k750,14k585, గా పిలుస్తారు.

1) 22k అంటే  22/24×100= 91.666…. అందుకే దీనిని 22k916 gold అంటారు.దీనిలో 91.6% బంగారం మిగతా సుమారు 8.4% ఇతర లోహాలు ఉంటాయి.ఇతర లోహాలు అంటే జింక్ ,కాపర్ మొదలైనవి ఉంటాయి.

2) 18k అంటే  18/24×100= 75.0 అందుకే దీనిని 18k750 gold అంటారు.దీనిలో 75.0% బంగారం మిగతా సుమారు 25.0% ఇతర లోహాలు ఉంటాయి.ఇతర లోహాలు అంటే జింక్ ,కాపర్ మొదలైనవి ఉంటాయి.

3) 14k అంటే  14/24×100= 58.333…. అందుకే దీనిని 14k585 gold అంటారు.దీనిలో 58.5% బంగారం మిగతా సుమారు 41.5% ఇతర లోహాలు ఉంటాయి.ఇతర లోహాలు అంటే జింక్ ,కాపర్ మొదలైనవి ఉంటాయి.

Gold Jewellery(బంగారు ఆభరణాలు) తయారి:

Gold Jewellery(బంగారు ఆభరణాలు) తయారికి సాదారణంగా 22k916 gold ని వాడతారు.తయారి సోల్దరింగ్ కోసం Cadmium(KDM) అనే లోహాన్ని వాడేవాళ్ళు, కాడ్మియంను వేడి చేసి ఆభరణాలను అతికించాలి,వేడి చేసినప్పుడు వచ్చే పొగ వల్ల స్వర్ణ కారులకు కేన్సర్ లాంటి వ్యాధులు మరియు ఈ ఆభరణాలను ధరించే వారికి కూడా ఇది ప్రమాదకరం.అందువల్ల BIS వారు 1417:1999 ఉత్తర్వులు ప్రకారం కాడ్మియం వాడకం నిషేదించారు.గతంలో  916KDM అనేవారు, ఇప్పుడు 916KDM పదం బంగారం షాప్ లలో వినపడదు.ప్రస్తుతం సోల్దరింగ్ చేయుటకు ఇతర లోహాలు  జింక్ ,కాపర్ వాడుతున్నారు.

What is BIS HALLMARK916 Gold(హాల్ మార్క్ బంగారం అంటే ఏమిటి)

What is BIS HALLMARK916 Gold(హాల్ మార్క్ బంగారం అంటే ఏమిటి),BIS అంటే Bureau of Indian Standards. ఇది కేంద్ర ప్రభుత్యం శాఖ  “Ministry of Consumer Affairs, Food and Public Distribution” క్రింద పనిచేస్తుంది. BIS ని 1986 Act అనుసరించి ప్రారంభించారు. బంగారు నగల పై BIS HALLMARK ని  2000 వ సంవత్సరం నుంచి ప్రారంభించారు.ప్రారంభంలో బంగారు ఆభరణాల పై ఈ క్రింది  5 అంశాలను హాల్ మార్క్ గా పరిగణించేవారు.

  1. HALLMARK SYMBOL (హాల్ మార్క్ గుర్తు)
  2. Purity of Gold  e.g 22k916 ( బంగారం స్వచ్చత e.g 22k916)
  3. Hallmark Centre Logo (హాల్ మార్క్ ముద్రించే స్టానిక సెంటర్ పేరు)
  4. Made of Year (తయారు అయిన సంవత్సరం) ఇది ఇంగ్లీష్ అక్షరాల్లో ఉంటుంది.
  5. Jewellery Shop Name (బంగారం షాప్ పేరు)

2017 నుంచి తయారి సంవత్సరం తీసివేసారు. 31 MARCH 2023 నుంచి  బంగారు ఆభరణాల పై 3 అంశాలనే ముద్రిస్తున్నారు.

  1. HALLMARK SYMBOL (హాల్ మార్క్ గుర్తు)
  2. Purity of Gold  e.g 22k916 ( బంగారం స్వచ్చత e.g 22k916)
  3. HUID NUMBER (Hallmark Unique Identification)  ( ఇది ఇంగీష్ అక్షారాలు మరియు నెంబర్ తో మొత్తం 6 ఉంటాయి. )

HALLMARK ఏక్కడ ముద్రిస్తారు.

బంగారు ఆభరణాలను తయారు చేసిన తరువాత దగ్గరలో ఉన్న హాల్ మార్క్ సెంటర్ లో,ఆ ఆభరణాన్ని తనీఖి చేసి హాల్ మార్క్ సింబల్, మరియు దాని స్వచ్చత మరియు HUID NUMBER ముద్రిస్తారు.దీనికి ప్రతి ఆభరణానికి కేవలం “Rs 35/- మరియు GST” చార్జ్ చేస్తారు.

CLCIK BIS HALL MARK CENTERS