TS 10 వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి |TS SSC RESULTS RELEASED 2023
TS SSC RESULTS RELEASED 2023
ఈ విద్యాసంవత్సరం ( 2022-23) తెలంగాణా లో 10 వ తరగతి పరీక్షలు గత నెలలో నిర్వహించారు. ఫలితాలను 10-05-2023 న 12.00 గంటలకు విద్యాశాఖామంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు విడుదల చేశారు
ఈ విద్యాసంవత్సరం ( 2022-23) తెలంగాణా లో 10 వ తరగతి పరీక్షల కోసం 4,94,504 మంది ధరఖాస్తు చేసుకోగా, 4,91,862 మంది పరీక్షలు రాశారు. అందులో 4,84,370 మంది రెగ్యులర్ గా , 7,492 మంది ప్రవేట్ గా హాజరు అయ్యారు.
పరీక్షల్లో మొత్తం 86.60% మంది పాస్ అయ్యారు. బాలురు 84.68% , బాలికలు 88.53% పాస్ అయ్యారు. 25 స్కూల్స్ లో సున్నా శాతం, 2,793 స్కూల్స్ లో 100% పాస్ అయ్యారు.
14-06-2023 నుంచి 22-06-2023 వరకు, 9.30 AM నుంచి 12.30 PM వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. ఫెయిల్ అయిన స్టూడెంట్స్ 26-05-2023 లోపు ఫీజు చెల్లించాలి.
SSC recounting & reverification procedure:
- రీకౌంటింగ్ అంటే ఆల్రెడీ వేసిన మార్కులను మళ్లీ ఒకసారి కౌంట్ చేసి ఏమైనా తేడా వస్తే సవరిస్తారు.
- రీవెరిఫికేషన్ లో మళ్ళీ ఒకసారి టోటల్ చేయడంతో పాటు ఏవైనా దిద్దని జవాబులను దిద్ది మార్కులు ఇచ్చి మళ్లీ టోటల్ చేసి జమ చేస్తారు.
- రీవెరిఫికేషన్ లో మన జవాబు పత్రాన్ని జిరాక్స్ తీసి పంపిస్తారు.
- రీకౌంటింగ్ ఫీజు సబ్జెక్టుకు ₹500 , రీ వెరిఫికేషన్ ఫీజు సబ్జెక్టుకు ₹1000 చలాను ద్వారా మాత్రమే కట్టాలి. ఒరిజినల్ చలానును అప్లికేషన్ కు జత చేయాలి
- రీకౌంటింగ్ అప్లికేషన్ ఫారాలు హైదరాబాదుకు (డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కు) పంపించాలి.
- రి వెరిఫికేషన్ ఫారాలు జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమర్పించాలి.
- రి వెరిఫికేషన్ ఫారంకు ఒక ఫోటో అతికించవలసి ఉంటుంది. అలాగే ఒక పెద్ద కవర్( బుక్ సైజు- స్కూలు అడ్రస్ రాసి), ఒక చిన్న కవరు పంపించవలసి ఉంటుంది.
- రీకౌంటింగ్ అప్లికేషన్ ఫారం తో పాటు ఒక చిన్న కవర్ (మన అడ్రస్ రాసి) పంపించవలసి ఉంటుంది
- రీ వెరిఫికేషన్ అప్లికేషన్ ఫారం మీద ప్రధానోపాధ్యాయుల సంతకం అవసరము.
- ఈ రెండు అప్లికేషన్లతో పాటు మన హాల్ టికెట్ జిరాక్స్, ఆన్లైన్ మెమో పంపించవలసి ఉంటుంది.
- రీ వెరిఫికేషన్ కు అప్లై చేస్తే, రీకౌంటింగ్ కు అప్లై చేయవలసిన అవసరం లేదు
ఫలితాలను తెలిపే ప్రభుత్వ మరియు ఇతర వెబ్సైటులు