TS DSC NOTIFICATION 2024 |TS DSC ONLINE APPLICATION 2024
TS DSC NOTIFICATION 2024 |TS DSC ONLINE APPLICATION 2024 | మెగా డీఎస్సీ నోటిఫికేషన్ |11,062 పోస్టులకు విడుదల మే లేదా జూన్‌లో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు | 2023 నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు | పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదు
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రభుత్వం 29-02-2024 న విడుదల చేసింది. వీటిల్లో గత ప్రభుత్వం జారీ చేసిన 5,089 పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులకు అదనంగా 4,957 టీచర్ పోస్టులు, మరో 1, 016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కలిపి మొత్తం 11, 062 పోస్టులకు కొత్త నోటిఫికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం తన నివాసంలో విడుదల చేశారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి.
గత ఏడాది సెప్టెంబరు 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ ప్రకటన రద్దుకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్రంగా మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేసారు. గత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని.. కొత్త డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో గత ఏడాది 5,089 టీచర్ల భర్తీకి జారీ చేసిన పాత డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే.గత డీఎస్సీకి 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. గత దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారు తాజాగా మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మే నెలలో డీఎస్సీ రాత పరీక్షలను కంప్యూటర్‌బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తారు. మొత్తం 10 రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయి. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు స్కూల్ అసిస్టెంట్‌లో గణితం, ఫిజిక్స్ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీపడనున్న నేపథ్యంలో పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఒకే అభ్యర్ధి వేరు,వేరు, పోస్ట్ లకు దరఖాస్తు చేయదలిస్తే, ప్రతి దరఖాస్తుకు ఫీ Rs 1000/- మరియు వేరు,వేరు దరఖాస్తులు సమర్పించాలి. పరీక్ష ఆన్లైన్ లో కంప్యూటర్ ఆధారితం గా ఉంటుంది.
COMMISSIONER,SCHOOL EDUCATION,TELANGANA: HYDERABADDSC ( Teachers Recruitment) -2024 |
|||||||||
IMPORTENT DATES
|
APPLICATION FEE
|
||||||||
Written Test: Computer Based Recruitment Test(CBRT) to be Conduct ‘ONLINE”
EXAM CENTERS: 1) Mahabubnagar 2)Ranga Reddy 3) Hyderabad 4) Medak 5) Nizamabad 6) Adilabad 7) Karimnagar 8) Warangal 9) Khammam 10) Nalgonda 11) Sangareddy |
|||||||||
Follow WhatsApp Channel |
|||||||||
DSC POSTS |
|||||||||
DSC NOTIFICATION |
|||||||||
IMPORTENT LINKS | |||||||||
Online Application | Click Here | ||||||||
Official Website | Click Here | ||||||||
Download Notification | Click Here |