Strange World

ఈ ప్రపంచం కూడా ఎంతో విచిత్రం (Strange world) ———————–

“నడవడం రానప్పుడు పడనిచ్చే వారు కాదు—ఎప్పుడైతే నడవడం మొదలు పెట్టెమో అడుగడుగున పడేయాలని చూస్తారు,”

“ఎప్పుడైతే మనం నిశ్శబ్దంగా ఉంటూ అన్నింటిని సహిస్తమో చాలా మంచి వారుగా కనబడతాము. ఒకటి, అర సార్లు నిజం చెప్పడానికి ప్రత్నిస్తే చెడ్డవారమవుతాము”

“మీ కళ్ళు అందంగా ఉంటే మీకు ప్రపంచం అందంగా కనబడుతుంది—అదే మీ నాలుక మంచిదైతే ప్రపంచానికి మీరు అందంగా కనబడతారు.”

“ఏళ్ళ తరబడి తెగిన బంధాలు క్షణాల్లో కలుస్తాయి —- ఎదుటి వారికి మీతో పని ఉండాలి.

“క్షమించమని కోరటంలో ఇది నిరూపించబడదు —మనం తప్పు అని వాళ్లు ఒప్పు అని —- బంధాలను పటిష్టపరచటం వాళ్ల కన్నా మనకు ఎక్కువ తెలుసు అని—–“

“జీవితం యెక్క అసలైన రంగులు దానికి బాగా తెలుసు “దుఖః గా ఉన్న రాత్రి పడుకోలేము —సుఖః ఉన్న రాత్రి పడుకోనివ్వదు”

“ఆ వ్యక్తి జీవితం లో ఎప్పటికి ఓడిపోడు —- సహించటం తెలుసుకున్నవాడు”

“జీవితంలో రెండు పనులు ఎప్పటికి చేయవద్దు —– అసత్యనితో సవాసం ,సత్యవంతుని తో విరోధం”

“బాట లో కంకర రాళ్లు ఉండనివ్వండి — మంచి మంచి చెప్పుల తో దాని పై నడవవచ్చు — కానీ ఒక మంచి చెప్పులో ఒక్క కంకర రాయి ఉన్న మంచి రోడ్డు మీద కూడా ఒక్క అడుగు కూడా కష్టం —-“
“అర్ధం ఏమనగా ———“
“బాహ్య శక్తులతో కాదు మనలోని బలహీనలతో ఓడిపోతాము”

హృదయాలలో స్థానం సంపాదిస్తాడు.

ఒక హిందీ కవితకు స్వేచ్చ అనువాదం –by blog Admin

Leave a Comment