Navodaya Jobs 2024 |నవోదయ’లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన
నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. దేశంలోని నవోదయ విద్యాలయాల్లో బోధనేతర (నాన్ టీచింగ్) సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది. దేశంలోని 1,377 నాన్ టీచింగ్ సిబ్బంది భర్తీకి నవోదయ విద్యాలయ సమితి (NVS) దరఖాస్తులు స్వీకరించనుంది. ఉద్యోగ స్థాయిని బట్టి భారీ వేతనాలు అందించనున్నారు. అర్హులైనవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల చివరి తేదీ 30-04-2024, పరీక్ష తేదీలను ఇంకా ప్రకటించలేదు.
ఉద్యోగ ఖాళీల వివరాలు:
ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులు 121 కాగా, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 5; ఆడిట్ అసిస్టెంట్ 12; జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ 4; లీగల్ అసిస్టెంట్ 1; స్టెనోగ్రాఫర్ 23; కంప్యూటర్ ఆపరేటర్ 2; క్యాటరింగ్ సూపర్‌వైజర్ 78; జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 381; ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ 128; ల్యాబ్ అటెండెంట్ 161; మెస్ హెల్పర్ 442; మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 19 చొప్పున పోస్టులను భర్తీ చేస్తారు.
పోస్టుల వారీగా వేతనాలు:
ఫిమేల్ స్టాఫ్ నర్స్ (లెవెల్-7) వేతనం రూ.44,900 – రూ.1,42,400 కాగా; అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్సిలేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.35,400-1,12,400; స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ సూపర్‌వైజర్, రూ.25,500-81,100; జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(హెచ్‌క్యూ/ఆర్‌వో క్యాడర్), జూనియర్ సెక్రటేరియట్ (జేఎన్‌వీ క్యాడర్), ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ రూ.19,900-63,200, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కొలువులకు రూ.18,000-56,900 చొప్పున వేతనం ఇవ్వనున్నారు.
విద్యార్హత:
పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని చేసిన అనుభవం ఉండాలి.
వయో పరిమితి:
ఉద్యోగాన్ని బట్టి వయో పరిమితి ఉంది,నోటిఫికేషన్ లో 6 నుండి 10 వ పేజీ వరకు చూడండి.
పరీక్ష విధానం:
ఉద్యోగాన్ని బట్టి పరీక్షా విధానం ఉంది,నోటిఫికేషన్ లో 15 నుండి 21 వ పేజీ వరకు చూడండి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష హిందీ, ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది. తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు.
దరఖాస్తు ఫీజు:
జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500(ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు) రూ.1000 (ఇతర పోస్టులకు). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.500.
దరఖాస్తు చేయు విధానం:
- ఆన్లైన్ లో అప్లై చేయుటకు ఈ లింకు ను క్లిక్ చేయండి. NAVODAYA JOBS 2024
- Step 1: Registration Form:
ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ కోసం నమోదు చేసుకోండి మరియు అప్లికేషన్ నంబర్‌ను గుర్తు పెట్టుకోండి. అభ్యర్థి ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను నింపేటప్పుడు అవసరమైన వివరాలను నింపాలి మరియు పాస్‌వర్డ్‌ని క్రియేట్ చేసి , భద్రతా ప్రశ్నను ఎంచుకుని, వాటికి సమాధానాన్ని నమోదు చేయాలి. వ్యక్తిగత వివరాలను విజయవంతంగా సమర్పించిన తర్వాత, అప్లికేషన్ నంబర్ రూపొందించబడుతుంది మరియు దరఖాస్తు ఫారమ్‌లోని మిగిలిన దశలను పూర్తి చేయడానికి ఉపయోగించబడుతుంది మరియు అన్ని భవిష్యత్ సూచన/కరస్పాండెన్స్ కోసం కూడా ఇది అవసరం. ఈ అప్లికేషన్ నంబర్ NVS – 2024 (నాన్-టీచింగ్) కోసం కూడా ఉపయోగించబడుతుంది తదుపరి లాగిన్ల కోసం, అభ్యర్థి సంబంధిత సిస్టమ్ రూపొందించిన అప్లికేషన్ నంబర్ మరియు క్రియేట్ చేసిన పాస్‌వర్డ్‌తో నేరుగా లాగిన్ చేయగలరు.
Step 2: Application Form :
అభ్యర్థులు వ్యక్తిగత వివరాలను పూరించడం, పేపర్ కోసం దరఖాస్తు చేయడం, పరీక్షా నగరాలను ఎంచుకోవడం, విద్యార్హతల వివరాలు మరియు ఫోటో అప్‌లోడ్ చేయడం వంటి వాటితో సహా దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయడానికి సిస్టమ్-జనరేటెడ్ అప్లికేషన్ నంబర్ మరియు ముందుగా రూపొందించిన పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయవచ్చు. మరియు పత్రాలు (ఏదైనా ఉంటే).ఇటీవలి ఫోటో కలర్ లేదా నలుపు/తెలుపులో 80% ముఖం (ముసుగు లేకుండా) మరీ తెలుపు గా కుండా ,చెవులు కనిపించెలా ఉండాలి
కావలసిన డాక్యుమెంట్స్ :
- Scanned photograph, thumb and signature should be in JPG format
- Size of the scanned photograph should be between 10 kb to 200 kb.
- Size of the scanned thumb should be between 3kb to 30 kb.
- Size of the scanned signature should be between 4 kb to 30 kb
- Size of the scanned copy of the certificates should be between 50 kb to 300 kb
Step 3: Fee Payment
స్టెప్ 1 మరియు స్టెప్ 2 పూర్తి చేసిన తర్వాత, అభ్యర్థులు అవసరమైన పరీక్ష రుసుమును చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, UPI లేదా Paytm సేవల ద్వారా మాత్రమే ఫీజును ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. సంబంధిత బ్యాంక్/పేమెంట్ గేట్‌వే ఇంటిగ్రేటర్ ద్వారా అభ్యర్థికి (పరీక్ష రుసుముతో పాటు) ప్రాసెసింగ్ ఛార్జీలు మరియు GST వర్తించబడుతుంది. అభ్యర్థి ఫీ చెల్లించిన తర్వాత మాత్రమే ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ యొక్క ధృవీకరణ పేజీ రూపొందించబడుతుంది. రుసుము చెల్లించిన తర్వాత ధృవీకరణ పేజీ రూపొందించబడకపోతే, విజయవంతమైన చెల్లింపును నిర్ధారించడానికి లేదా పొందడం కోసం అభ్యర్థి సంబంధిత బ్యాంక్/పేమెంట్ గేట్(సమాచార బులెటిన్‌లో ఇచ్చిన హెల్ప్‌లైన్ నంబర్ మరియు ఇ-మెయిల్‌లో) సంప్రదించవలసి ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
అనంతపురం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్
NAVODAYA JOB NOTIFICATIONధరఖాస్తు చివరి తేదీ 30-04-2024, ఆన్లైన్ లో అప్లై చేయుటకు ఈ లింకు ను క్లిక్ చేయండి. NAVODAYA JOBS 2024
ఇతర సమాచారం కోసం WhatsApp channel ని ఫాలో అవ్వండి.