LIC Policy Statement for Income Tax 2022-23

How to download LIC policy statement for income tax 2022-23 మరియు Home Loan statement for income tax ఇటువంటివి అన్ని ఈ ఆర్ధిక సంవత్సరం లో ఇన్కమ్ టాక్స్ ఫారం సబ్మిట్ చేయడానికి, ఈ ఆర్ధిక సంవత్సరం లో మనం చెల్లించిన LIC policy ల statement కాపీ ని జతచేయాలి. ఈ LIC policy లు శాలరీ బిల్ లో కట్టింగ్ అవుతుంటే, ప్రత్యేకంగా జతచేయనవసరం లేదు. డ్రాయింగ్ ఆఫీసరే దాని భాధ్యత తీసుకుంటారు కాబట్టి ఏటువంటి statement కాపీ ని జతచేయనవసరం లేదు.

కొంతమంది తమ LIC policy లు పై విధంగా కాకుండా,స్వయంగా (by hand) నెలకోసారి, లేదా మూడు నెలలకొకసారి, లేదా ఆరునెలలకొకసారి, సంవత్సరానికి ఒకసారి pay చేస్తుంటారు. ఇలాంటి అప్పుడు LIC policy ల statement కాపీ ని డ్రాయింగ్ ఆఫీసర్ కు ఇవ్వాలి.ఈ statement ను LIC ఆఫీసు కు వెళ్ళకుండానే ఆన్లైన్ లోనే తీసుకోవచ్చు.

దీనికోసం LIC వెబ్సైటు లో మొదట ఎకౌంటు ను క్రియేట్ చేయాలి, ఈ ఎకౌంటు లో ఈ statement కాకుండా ఇంకా అనేక సదుపాయాలు ఉన్నాయి. మీకు ఉన్న అన్ని పాలసీల వివరాలు తెలుసోకోవచ్చు,వాటికి సంబంధించిన gap periods, ప్రీమియం చెల్లింపు తేదీలు,పాలసీల పై లోన్ తీసుకొని ఉంటే ఆ వివరాలు,లోన్ వడ్డీ ఏంత అయిందో,మరియు మీ కుటుంబ సభ్యుల పాలసీలను add చేసుకోవచ్చు, వాటి ప్రీమియం లు ఆన్లైన్ లోనే చెల్లించవచ్చు,ఇలా ఇంకా అనేక రకాల సౌకర్యాలు దీనిలో ఉన్నాయి.

ఏలా రిజిస్టర్ చేసుకోవాలి,ఏలా లాగిన్ అవ్వాలి అన్న వివరాలు తెలుసుకుందాం. రెండు విధాలుగా చేయవచ్చు.

1 LIC వెబ్సైటు ద్వారా

2 మొబైల్ యాప్ ద్వారా

ఏ పద్దతి ద్వారా రిజిస్టర్ అయిన ఆ User ID Password తో వెబ్సైటు లేదా మొబైల్ యాప్ లో లాగిన్ కావచ్చు. మొదట వెబ్సైటు లో రిజిస్టర్ అయ్యే విధానం…

Step:-1 ఈ లింక్ ను క్లిక్ చేయాలి https://licindia.in/Home-(1)/Customer-Portal

Step:-2 New User ను క్లిక్ చేయండి.

Step:-3 తరువాత ఓపెన్ అయిన పేజి లో మీకు ఉన్న పాలసీలలో ఏదో ఒక Policy Number, Premium Amount (without Tax), Date of Birth, Mobile Number, Email Id ఇవి తప్పని సరిగా ఎంటర్ చేయాలి, Male or Female సెలెక్ట్ చేసి Proceed పై క్లిక్ చేయండి.

Step:-4 మొబైల్ కు OTP వస్తుంది, OTP ఎంటర్ చేసి Password సెట్ చేసుకోండి.

Step:-5 మళ్ళి ఈ లింక్ పై క్లిక్ చేసి https://licindia.in/Home-(1)/Customer-Portal ఈసారి Register User పై క్లిక్ చేసి User Id దగ్గర మీ మొబైల్ నెంబర్ మరియు Password దగ్గర ఇంతకుముందు సెట్ చేసుకున్న Password టైప్ చేయండి. Date of birth ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

LIC policy statement for income tax

వెబ్సైటు లో లాగిన్ అయ్యాక ఈ ఆర్ధిక సంవత్సరం LIC policy statement ఏలా తీసుకోవాలో చూద్దాం.

Step:-1 Basic Services ని క్లిక్ చేయండి.

Step:-2 Left Side లో ఉన్న Policy Premium Paid Statement ని క్లిక్ చేయండి

Step:3 Select Year దగ్గర 2022-23 Select చేసి మీకు కావలసిన పాలసి ని సెలెక్ట్ చేసి Generate Statement పై క్లిక్ చేయండి.

Step:4 LIC policy statement generate అవుతుంది, ప్రింట్ తీసుకోండి.

LIC పేరుతో రకరకాల యాప్ లు ఉన్నాయి, ఫేక్ యాప్ ను డౌన్లోడ్ చేస్తే, మన ఫోన్ లో డేటా హ్యాక్ అయ్యే అవకాశం ఉంది, అసలైన యాప్ ను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయాలి, ఇంస్టాల్ చేసి ఓపెన్ చేసి ఇంతకు ముందు సెట్ చేసుకున్న Password టైప్ చేయండి. Date of birth ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. 4 అంకెల MPIN ను సెట్ చేసుకోండి. https://play.google.com/store/apps/details?id=com.lic.liccustomer

వెబ్సైటు లో ఉన్న అన్ని ఆప్షన్స్ మొబైల్ యాప్ లో కూడా ఉన్నాయి. LIC policy statement యాప్ ద్వారా కూడా తీసుకోవచ్చు.యాప్ ద్వారా మీ ప్రీమియం లు కూడా పే చేయవచ్చు.

Leave a Comment