Indian Gas e-KYC
Indian Gas e-KYC చేయడం తప్పనిసరి,దీనిని Indian Gas Re-KYC అంటారు.అంటే మనం ఇంతకు ముందే e-KYC ఇచ్చి ఉన్నాము.మళ్ళి మరోసారి KYC చేయాలి. మీ పేస్ స్కాన్ ద్వారా దీనిని పూర్తి చేస్తారు.దీనిని ఏలా చేయాలి.
ఏక్కడ చేయాలి.
- మీ గ్యాస్ డీలర్ దగ్గర చేయవచ్చు.
- గ్యాస్ డెలివరి చేసే బాయ్ దగ్గర చేయవచ్చు.
- మీ మొబైల్ తో చేయవచ్చు.
పైవి రెండు చోట్ల చేయాలంటే మీ గ్యాస్ బుక్ చేసే మొబైల్ నెంబర్ లేదా మీ గ్యాస్ కార్డు ఉండాలి.వీటిని తీసుకొని గ్యాస్ కార్డు ఎవరి పేరుతొ ఉంటే,వాళ్ళే వెళ్ళాలి ,మీ పేస్(ముఖం) స్కాన్ చేస్తారు. Re-KYC అయిపోతోంది.కాని గ్యాస్ డీలర్ దగ్గర ఎక్కువగా జనం ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇంటి వద్దే,మీ మొబైల్ ఫోన్ లో Re-KYC సులువుగా చేయవచ్చు.
మీ మొబైల్ తో ఏలా చేయవచ్చు.
Step-1: మీ Anroid మొబైల్ లో Playstore లోకి వెళ్లి Indian oil one App ని డౌన్లోడ్ చేసుకొండి Click Here
Step-2: మీ Anroid మొబైల్ లో Playstore లోకి వెళ్లి Aadhar Face Rd (Early Access) App ని డౌన్లోడ్ చేసుకొండి Click here
Step-3: Indian oil one App లో మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ ఐడిని క్రియేట్ చూసుకోవాలి.
Step-4: క్రియేట్ చేసుకున్న తరువాత 16 అంకెల LPG ID ని లింక్ చేసుకోవాలి.
Step-5: Re-KYC చేసుకోవడానికి Indian oil one App లో Menu >My Profile >Re-KYC ని సెలెక్ట్ చేసుకొని Consent Box ని టిక్ చేసి Face Scan సెలెక్ట్ చేస్తే ,front Camera open అవుతుంది. మీ face ని front camera ద్వారా (కను రెప్పలు బ్లింక్ చేస్తూ) Scan చేయండి. గ్రీన్ కలర్ మెసేజ్ వచ్చే వరకు Scan చేయండి.Scan అయిన తరువాత confirm message వస్తుంది.
మీ రిజిస్టర్ మొబైల్ కి confirm message SMS రూపం లో వస్తుంది.మీ Re-KYC అయిపోయినట్టే.