How to Generate Aadhaar Virtual ID

How to Generate Aadhaar Virtual ID, ఆధార్ వర్చువల్ ఐడి ని జెనరేట్ చేయడం ఏలా? నేడు ఆధార్ ముఖ్యమైన గుర్తింపు కార్డ్, దీనిని అనేక చోట్ల మన గుర్తింపు కోసం మరియు చిరునామా గుర్తింపు కోసం వాడుతున్నాము. కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాలన్న, బ్యాంకు ఎకౌంటు ఓపెన్ చేయాలన్న, డ్రైవింగ్ లైసెన్స్ కోసం,బండి రిజిస్టేషన్ కోసం, ప్రభుత్వం ఇచ్చే అనేక పధకాల కోసం నిత్యం వాడుతుంటాము.

మన ఆధార్ కార్డును జిరాక్స్ తీయిస్తూఉంటాము, లేదా ఏక్కడైనా మర్చిపోవచ్చు, ఇలా ప్రవేటు వ్యక్తుల దగ్గర కు మీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ చేరవచ్చు. ఈ మధ్య మన బ్యాంకు ఎకౌంటు లో డబ్బును ఆధార్ నెంబర్ సహాయంతో డ్రా చేసినట్టు వార్తలు వింటున్నాము. మన ఆధార్ మీద ను ఇతర అవసరాలకు,ఇతరులు వాడవచ్చు.

మన ఆధార్ కార్డు ధ్రువినియోగం కాకుండా చూచుకోవాలని, ఆధార్ జారి సంస్థ అయిన UIDIA ( Unique Identification Authority of India) హెచ్చరిక జారీచేసింది. అసలు ఆధార్ నెంబర్ కు బదులు ఆధార్ వర్చువల్ ఐడి ఉపయోగించాలని సూచించింది. ఆధార్ కార్డు ఇవ్వనవసరం లేదు. e-KYC కోసం అసలు ఆధార్ నెంబర్ కు బదులు ఆధార్ వర్చువల్ ఐడి ఉపయోగించవచ్చు.

Aadhaar Virtual IDఏలా Generate చేయాలో చూద్దాం

Step:-1 మీ మొబైల్ నెంబర్, మీ ఆధార్ కు లింక్ అయ్యి ఉండాలి.

Step:-2 ఈ లింక్ ను క్లిక్ చేయండి. https://myaadhaar.uidai.gov.in/genericGenerateOrRetriveVID

Step:-3 తరువాత Generate Virtual ID సెలెక్ట్ చేయండి. మీ ఆధార్ నెంబర్ మరియు captcha code ను ఎంటర్ చేసి Send OTP పై క్లిక్ ఇవ్వండి.

Step:-4 మీ రిజిస్టర్ మొబైల్ కు OTP వస్తుంది, OTP ఎంటర్ చేసి Verify AND Proceed క్లిక్ చేయండి.

Step:-5 “16 సంఖ్యల Virtual ID” స్క్రీన్ పై Display మరియు మీ రిజిస్టర్ మొబైల్ కు కూడా వస్తుంది.

ఈ 16 సంఖ్యల Virtual ID ని ఆధార్ నెంబర్ బదులు ఏక్కడైనా వాడుకోవచ్చు. ఈ Virtual ID, Generate చేసిన తరువాత ఒక క్యాలెండర్ రోజు మాత్రమే ఉంటుంది, అంటే ఆ రోజు రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. తరువాత ఈ Virtual ID పనిచేయదు. తిరిగి మళ్ళి పైన చూపిన పద్దతిలో Generate చేయాలి.

మీకు వచ్చిన మెసేజ్ పొరపాటున డిలిట్ అయితే, అదే Virtual ID ని తిరిగి అదే రోజు రాత్రి 12 గంటల లోపు పొందటానికి ఈ లింక్ ను క్లిక్ చేయండి. https://myaadhaar.uidai.gov.in/genericGenerateOrRetriveVID

తరువాత Retrieve ID ని సెలెక్ట్ చేయండి. మీ ఆధార్ నెంబర్ మరియు captcha code ను ఎంటర్ చేసి Send OTP పై క్లిక్ ఇవ్వండి.

పై విధంగా ప్రొసీజర్ చేస్తే తిరిగి Virtual ID “16 సంఖ్యల Virtual ID” స్క్రీన్ పై Display మరియు మీ రిజిస్టర్ మొబైల్ కు కూడా వస్తుంది.

SMS ద్వారా Virtual ID ని Generate చేయడం

SMS ద్వారా కూడా Virtual ID ని Generate చేయవచ్చు, మీ రిజిస్టర్ మొబైల్ నుండి GVIDఆధార్ లోని చివరి 4 నెంబర్లు టైప్ చేసి 1947 కు పంపాలి, మీ రిజిస్టర్ మొబైల్ కు “16 సంఖ్యల Virtual ID”వస్తుంది.

ఉదాహరణ :- మీ ఆధార్ లో చివరి 4 నెంబర్ లు 5432 అయితే …..GVID5432 Send to 1947

SMS ద్వారా Retrieve ID ని Generate చేయడం

SMS ద్వారా కూడా Retrieve ID ని Generate చేయవచ్చు, మీ రిజిస్టర్ మొబైల్ నుండి RVIDఆధార్ లోని చివరి 4 నెంబర్లు టైప్ చేసి 1947 కు పంపాలి, మీ రిజిస్టర్ మొబైల్ కు “16 సంఖ్యల Retrieve ID “వస్తుంది.

Leave a Comment