WhatsApp Settings

మీ WhatsApp హ్యాక్ కాకుండా ఈ సెట్టింగ్స్ చేసుకోండి

సోషల్ మీడియా లో WhatsApp ది ప్రత్యేక స్థానం.ప్రతి స్మార్ట్ ఫోన్ లో WhatsApp ఉంటుంది. నిత్యం ఈ యాప్ ను ఓపెన్ చేస్తూ ఉంటాము.మన ఈ బాలహీనతనే ఆసరాగా తీసుకొని హ్యకర్స్ అనేక మోసాలకు పాల్పడుతున్నారు.

మనకు తెలియకుండా,మన అనుమతి(పర్మిషన్) లేకుండా మన నెంబర్ ను గ్రూప్స్ లో యాడ్ చేస్తున్నారు.మిమ్మలి ఆ గ్రూప్ అడ్మిన్ గా చేయవచ్చు. అంటే ఆ గ్రూప్ లో పోస్ట్ చేసే అన్నింటికీ మీరు భాధ్యత వహించాలి.

WhatsApp లో కాల్ ఏ దేశానికైనా చేయవచ్చు,దీన్ని అవకాశంగా తీసుకొని సైబర్ మోసగాళ్ళు ఇతర దేశాల నుంచి వాయిస్ కాల్ లేదా వీడియొ కాల్ చేయవచ్చు. ప్రస్తుతం విడియో కాల్స్ చేసి అనేక రకాలుగా లోబర్చుకొని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కాల్స్ మన దేశం లోవీ కూడా కావచ్చు.

మీ WhatsApp ను మీకు తెలియకుండా వేరే ఫోన్ లో ఓపెన్ చేయవచ్చు లేదా మీ IP ADDRESS తో మీ లైవ్ లొకేషన్ ని హ్యాకర్స్ కనిపెట్టవచ్చు.ఇవి జరగకుండా ఉండాలంటే మీ WhatsApp Settings ఈ క్రింద విధంగా చేసుకోండి.

1) వేరే గ్రూప్స్ లో యాడ్ చేయకుండా.

WhatsApp ఓపెన్ చేసి కుడి వైపు పైన ఉండే మూడు చుక్కలను క్లిక్ చేయండి→→Settings ను క్లిక్ చేయండి.→→Privacy ను క్లిక్ చేయండి  →→Groups ను క్లిక్ చేయండి →→My contacts (Nobody కొన్ని ఫోన్ లలో ఇది ఉంది) క్లిక్ చేయండి.

2) మీ contacts లో లేని వాళ్ళు కాల్ చేస్తే రింగ్ కాకుండా.

WhatsApp ఓపెన్ చేసి కుడి వైపు పైన ఉండే మూడు చుక్కలను క్లిక్ చేయండి→→Settings ను క్లిక్ చేయండి.→→Privacy ను క్లిక్ చేయండి  →→Calls ను క్లిక్ చేయండి →→ Silence unknown callers ను ఆన్ చేయండి.

3) మీ Live Location ను తెలుసుకోకుండా.

WhatsApp ఓపెన్ చేసి కుడి వైపు పైన ఉండే మూడు చుక్కలను క్లిక్ చేయండి→→Settings ను క్లిక్ చేయండి.→→Privacy ను క్లిక్ చేయండి  →→Advanced ను క్లిక్ చేయండి →→ Protect IP address in calls ను ఆన్ చేయండి.

4) మీ WhatsApp లో వేరే వాళ్ళు Login అవ్వకుండా.

WhatsApp ఓపెన్ చేసి కుడి వైపు పైన ఉండే మూడు చుక్కలను క్లిక్ చేయండి→→Settings ను క్లిక్ చేయండి.→→Accounts ను క్లిక్ చేయండి  →→Two-step verification ను క్లిక్ చేయండి →→ Turn on ను ఆన్ చేయండి →→ 4 అంకెల పాస్ వర్డ్ ఇవ్వండి. ఈ పాస్ వర్డ్ గుర్తు పెట్టుకోండి. ఎవరైనా మీ WhatsApp login అవ్వాలను కుంటే OTP తో పాటు ఈ పాస్ వర్డ్ కూడా ఇవ్వాలి.

CALL FORWARDING SCAM అంటే ఏమిటి?