TS EAMCET RESULTS 2023

TS EAMCET 2023 ఫలితాలు విడుదల తేది ఖరారు |TS EAMCET RESULTS 2023

TS EAMCET RESULTS 2023

మే 25వ తేదీన టీఎస్ ఎంసెట్ – 2023 ఫ‌లితాలు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఎంసెట్ క‌న్వీన‌ర్ ప్ర‌క‌ట‌న చేశారు. టీఎస్‌ ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌, ఫార్మసీ ) ఫలితాలను గురువారం ఉదయం 9:30 గంటలకు మంత్రి సబితాఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆమె ఉన్నతాధికారులతో కలిసి ఫలితాలను రిలీజ్‌ చేస్తారు. వాస్తవానికి, ఫలితాలను ఉదయం 11 గంటలకు కూకట్‌పల్లి జేఎన్టీయూలో విడుదల చేయాల్సి ఉన్నది. అయితే, జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశంకానుండటం, దీనికి మంత్రి సబిత హాజరుకానున్న నేపథ్యంలో 9.30 గంటలకే ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఉదయం 9.45 గంటల తర్వాత ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్, మెడిక‌ల్, ఇంజినీరింగ్ కోర్సుల‌కు సంబంధించిన ఫ‌లితాల ర్యాంకుల‌ను, మార్కుల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఎంసెట్ హాల్ టికెట్ నంబ‌ర్ ద్వారా ఫ‌లితాల‌ను తెలుసుకోవ‌చ్చు. ఇక మెడిక‌ల్, అగ్రిక‌ల్చ‌ర్, ఇంజినీరింగ్ టాప్ టెన్ ర్యాంక‌ర్ల వివ‌రాల‌ను కూడా వెల్ల‌డించ‌నున్నారు.

ఎంసెట్ ఫ‌లితాల కోసం వెబ్సైట్ లింక్

CLICK HERE LINK -1

Leave a Comment