DHARANI
మీ వ్యవసాయ భూమి వివరాలు తెలుసుకోండి.
ధరణి (DHARANI)
ధరణి (DHARANI)
తెలంగాణాలో మీ వ్యవసాయ భూమి వివరాలు,మీ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
ఈ వివరాలు రెండు విధాలుగా తెలుసుకోవచ్చు
1) సర్వే నెంబర్ ఆధారం గా
2) పట్టా పాస్ బుక్ నెంబర్ ఆధారం గా
సర్వే నెంబర్ ఆధారం గా తెలుసుకోవాలంటే, సర్వే నెంబర్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి.
ఈ పద్దతి లో కేవలం భూమి వివరాలు వస్తాయి,కాని పట్టా పాస్ బుక్ నెంబర్ తో పట్టా పాస్ బుక్ కాపి ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సెర్చ్ చేయడానికి కావలసిన వివరాలు,
✔ సర్వే నెంబర్
✔ పాస్ బుక్ నెంబర్
✔ ఆధార్ నెంబర్
1) సర్వే నెంబర్ ఆధారం గా సెర్చ్ చేయాలంటే ,ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
https://dharani.telangana.gov.in/knowLandStatus
క్రింది పేజి వస్తుంది , మీ జిల్లా, మండలం , విలేజ్ సెలెక్ట్ చేయండి.తరువాత పక్కన ఉండే కోడ్ ను ఎంటర్ చేయండి ” Fetch” పై క్లిక్ చేయండి. 👇
తరువాత ఈ క్రింది పేజ్ ఓపెన్ అవుతుంది , సర్వే నెంబర్ ఎంటర్ చేసి పక్కన ఉండే కోడ్ ఎంటర్ చేయండి. 👇
మీ భూమి వివరాలు కనిపిస్తాయి, పాస్ బుక్ కాపీని కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది విధంగా చేయండి. 👇
2) పట్టా పాస్ బుక్ నెంబర్ ఆధారం గా సెర్చ్ చేయాలంటే ,ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
క్రింది పేజి వస్తుంది , పట్టా పాస్ బుక్ నెంబర్ సెలెక్ట్ చేసి , పట్టా పాస్ బుక్ నెంబర్ ఎంటర్ చేసి, పక్కన ఉండే కోడ్ ను ఎంటర్ చేయండి ” Fetch” పై క్లిక్ చేయండి. 👇
క్రింది పేజి వస్తుంది , మీ ఆధార్ నెంబర్ లో మొదటి నాలుగు నెంబర్లు ఎంటర్ చేసి, పక్కన ఉండే కోడ్ ను ఎంటర్ చేయండి ” Fetch” పై క్లిక్ చేయండి. 👇
మీ భూమి వివరాలు వస్తాయి, పాస్ బుక్ కాపి డౌన్లోడ్ చేసుకోవడానికి “కన్ను” బొమ్మ పై క్లిక్ చేయండి , పాస్ బుక్ కాపి కనిపిస్తుంది .కంప్యూటర్ లో అయితే Ctrl+P తో ప్రింట్ తీసుకోవచ్చు.