PVC Aadhar Card అంటే polyvinyl chloride Aadhaar card, ఇది ATM కార్డు లానే ఉంటుంది.మరియు దీని పై సెక్యూర్ కోడ్ ,హలోగ్రామ్,ఇతర అనేక భద్రతా అంశాలతో ఈ కార్డు ను రూపొందించారు.
ఈ కార్డ్ ను మాములు ఆధార్ కార్డులానే ఏక్కడైనా వాడుకోవచ్చు, మన జేబులో పట్టే పరిణామం లో ఉంటుంది.
దీనిని పొందడానికి ఇలా చేయాలి. ఈ లింక్ ను క్లిక్ చేయండి
Step:-1 ఈ లింక్ ను క్లిక్ చేయండి https://myaadhaar.uidai.gov.in/genricPVC
Step:-2 మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయండి.
Step:-3 మీ రిజిస్టర్ మొబైల్ కు OTP వస్తుంది,దానిని ఎంటర్ చేయండి. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ కాకపొతే “My mobile number is not registered” క్లిక్ చేసి కొత్త నెంబర్ ని ఎంటర్ చేయండి.
Step:-4 OTP verify చేయడానికి submit బటన్ పై క్లిక్ చేయండి.
Step:-5 మీ ఆధార్ వివరాలు స్క్రీన్ పై కనబడతాయి,” Make Payment” పై క్లిక్ చేయండి payment gateway open అవుతుంది. గూగుల్ పే లేదా పోన్ పే ద్వారా పేమెంట్ చేయండి.
ఇతర పేమెంట్ పద్దతులు:- క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ , PAYTM ,ఏదైనా UPI Payments
FEE :- Fee 50/- GST మరియు అన్ని టాక్స్ లు కలుపుకొని
మీ PVC Aadhaar Card 5 రోజుల్లో పోస్ట్ లో మీ ఆధార్ లో ఉన్న అడ్రస్ కు వస్తుంది.