ఆరు గ్యారంటీల (6 GUARANTEES Prajapalana Application) అమలు కార్యాచరణ.
కాంగ్రెస్ ఏన్నికల సందర్భంగా వాగ్దానం చేసిన ఆరు గ్యారంటీల (6 GUARANTEES Prajapalana Application) అమలుకు శ్రీకారం చుట్టింది.సచివాలయంలో ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు సమావేశం నిర్వహించారు.సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సదస్సు వివరాలను వెల్లడించారు.
ఆరు గ్యారంటీల (6 GUARANTEES Prajapalana Application) దరఖాస్తు ఏప్పటి నుంచి?
‘‘ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులను ముందుగా ప్రజలకు అందిస్తారు.ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామసభల ద్వారా ఆ దరఖాస్తులు తీసుకుంటాం. అర్హత ఉన్నవారు గ్రామసభల్లో అధికారులకు దరఖాస్తులు అందజేయాలి. ప్రజలు దరఖాస్తులు ఇచ్చిన తర్వాత అధికారులు ఒక రసీదు ఇస్తారు. ఇందిరమ్మ పాలనలో అధికారులే ఇంటి వద్దకు వెళ్లి దరఖాస్తులు తీసుకుంటారు, అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivasredyy) తెలిపారు.
ఊరి లో 10 ఇళ్లు ఉన్నా .. అధికారులే వెళ్లి దరఖాస్తు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించాం. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత వారు ఏ పథకానికి అర్హులో అధికారులు నిర్ణయిస్తారు.గ్రామసభలకు వచ్చే వారు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామసభల నిర్వహణకు కావాల్సిన నిధులను సీఎం విడుదల చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో రెండింటిని ఇప్పటికే అమలు చేశాం. గతంలో 33 శాతం మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు. ప్రస్తుతం 58శాతానికి పైగా మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivasredyy) వివరించారు.